Share News

కష్టపడిన వారిని గుర్తించడమే టీడీపీ సిద్ధాంతం: మంత్రి లోకేశ్..

ABN , Publish Date - Apr 08 , 2026 | 05:15 PM

తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించడమే తమ సిద్ధాంతమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పార్టీకి అండగా నిలిచిన వారిని ఎప్పటికీ విస్మరించేది లేదన్నారు.

కష్టపడిన వారిని గుర్తించడమే టీడీపీ సిద్ధాంతం: మంత్రి లోకేశ్..
My TDP App Top Performers

అమరావతి: తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించడమే తమ సిద్ధాంతమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. పార్టీకి అండగా నిలిచిన వారిని ఎప్పటికీ విస్మరించేది లేదన్నారు. 'మై టీడీపీ యాప్' టాప్-10 ఫెర్మార్మర్లతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వారితో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా ‘మై టీడీపీ యాప్’ సమర్థ వినియోగం, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనడంపై మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. మీ పని తీరే ఇక్కడి వరకు రావడానికి కారణమంటూ కొనియాడారు. ఉత్తమ కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం మరింతగా కష్టపడాలని, టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి లోకేశ్ భరోసా కల్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి

రూ.185 కోట్లతో విజయవాడ స్టేడియం అభివృద్ధి: మంత్రి మండిపల్లి..

అమరావతిలో రూ.2,534 కోట్లతో కేంద్రం భారీ నిర్మాణాలు

Updated Date - Apr 08 , 2026 | 05:20 PM