Share News

హస్తకళాకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్

ABN , Publish Date - Jul 08 , 2026 | 09:15 PM

హస్తకళాకారులకు ఇచ్చిన మాటను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిలబెట్టుకున్నారు. డిప్యూటీ సీఎం చొరవతో నరసాపురం, శ్రీకాళహస్తిలో‌ హస్త కళాకారులకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.

హస్తకళాకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్
Pawan Kalyan

అమరావతి, జులై 8 (ఆంధ్రజ్యోతి): హస్తకళాకారులకు ఇచ్చిన మాటను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నిలబెట్టుకున్నారు. డిప్యూటీ సీఎం చొరవతో నరసాపురం, శ్రీకాళహస్తిలో‌ హస్తకళాకారులకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇచ్చిన మాటను 24 గంటల్లోగా ఉప ముఖ్యమంత్రి అమల్లోకి తీసుకువచ్చారు. నిన్న(మంగళవారం) ఏపీ హస్తకళా మహోత్సవంలో హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ఆయన మాట ఇచ్చిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ సూచనతో హస్తకళాకారుల ఆరోగ్యానికి భరోసా ఇచ్చే విధంగా క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలను అధికారులు ప్రారంభించారు.


నరసాపురంలో 105 మంది లేస్ కళాకారులకు పరీక్షలు నిర్వహించగా, 37 మందికి కంటి సంబంధిత సమస్యలు ఉన్నట్లుగా నిర్ధారించారు. అందులో 16 మందికి కళ్లలో శుక్లాలు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. అవసరమైన వారికి వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో శస్త్రచికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నపాటి దృష్టి సమస్యలు ఉన్న 21 మందికి కళ్ల జోళ్లు ఇప్పించేలా ఏర్పాట్లు చేశారు.


శ్రీకాళహస్తిలో మొత్తం 53 మంది హస్తకళాకారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేక పరీక్షలతో పాటు అన్నిరకాల ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మహాలక్ష్మితోపాటు అందే లక్ష్మి అనే మరో లేస్ కళాకారిణినిని ప్రత్యేక వాహనంలో పెదకాకాణిలోని శంకర కంటి ఆస్పత్రికి పిలిపించి పవన్ కల్యాణ్ పరీక్షలు చేయించారు. ఇరువురికీ దృష్టి దోషాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. కళ్లజోళ్లు, ఐ డ్రాప్స్, మందులు ఇచ్చి పంపించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సంప్రదాయ హస్తకళా వారసత్వానికి ఏపీ పుట్టినిల్లు: పవన్ కల్యాణ్

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలో భారీ ప్రక్షాళన.. అధికారులపై వేటు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 08 , 2026 | 09:50 PM