టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్నారై గ్లోబల్ టీడీపీ అధ్యక్షుడిగా గురు రాజా ప్రమాణ స్వీకారం
ABN , Publish Date - Sep 09 , 2026 | 11:41 AM
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్నారై గ్లోబల్ టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం జరిగింది. ఎన్నారై గ్లోబల్ టీడీపీ అధ్యక్షుడిగా పి. గురు రాజాతోపాటు సభ్యులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు.
అమరావతి, సెప్టెంబర్ 08: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్నారై గ్లోబల్ టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం జరిగింది. NRI గ్లోబల్ టీడీపీ అధ్యక్షుడిగా పి. గురు రాజాతోపాటు సభ్యులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి.. ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పలు దేశాల నుంచి గ్లోబల్ టీడీపీ కార్యవర్గ సభ్యులు విచ్చేశారు. వివిధ దేశాల నుంచి వచ్చిన ఎన్నారైలు, వారి కుటుంబ సభ్యులతోపాటు అభిమానులతో పార్టీ కేంద్ర కార్యాలయం కిక్కిరిసి పోయింది.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ అరాచక పాలన అంతానికి నాంది పలికిన చారిత్రక సందర్భం: మంత్రి అనగాని
రైలు ప్రయాణమంటే ఇంత సాహసం చేయాలా?.. వీడియో వైరల్
For AP News And Telugu News