Share News

అసెంబ్లీకి రాకుండా పారిపోతున్న జగన్: మంత్రి లోకేశ్

ABN , Publish Date - Aug 20 , 2026 | 04:24 PM

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించే పరీక్షల వ్యవస్థపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు అవగాహన లేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి లోకేశ్ గురువారం కౌంటర్ ఇచ్చారు.

అసెంబ్లీకి రాకుండా పారిపోతున్న జగన్: మంత్రి లోకేశ్
AP Minister Lokesh

అమరావతి, ఆగస్టు 20: ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించే పరీక్షల వ్యవస్థపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు అవగాహన లేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి లోకేశ్ గురువారం కౌంటర్ ఇచ్చారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీ రెండూ ఒకటే అనుకుంటున్నారా? అంటూ వైసీపీ అధినేతపై మండిపడ్డారు. APPSC అంటే ఏమిటో, DSC అంటే ఏమిటో జగన్‌కు తెలియదంటూ వ్యంగ్యంగా అన్నారు. ఈ రెండు పరీక్షలను ఒకే గాటిన కట్టడం, ఒకటే అనుకోవడం జగన్ అవగాహన స్థాయిని తెలియజేస్తుంటూ ఎద్దేవా చేశారు.


వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించ లేదని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు డీఎస్సీ నిర్వహించ లేకపోయారు.. ప్రస్తుతం అసెంబ్లీలో చర్చకు రాకుండా పారిపోతున్నారంటూ జగన్‌కు చురకలంటించారు పరీక్షల వ్యవస్థపై అవగాహన లేని వ్యక్తి ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతున్నారంటూ జగన్‌పై మంత్రి లోకేశ్ నిప్పులు చెరిగారు.


డీఎస్సీ, ఏపీపీఎస్‌సీ మధ్య తేడా తెలియని వైఎస్ జగన్‌కు పరీక్షలపై మాట్లాడే అర్హత ఉందా? అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి లోకేశ్ తన ఎక్స్ ఖాతా వేదికగా జగన్‌కు కౌంటర్ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు ఆదర్శ పాలన అందిస్తున్నారు: ఎంపీ శ్రీభరత్

వన్‌ వేపై సర్‌ప్రైజ్‌ చెక్‌.. సామాన్యుడిలా బైక్‌పై కేబీఆర్‌కు సీపీ సజ్జనార్

For More AP News And Telugu News

Updated Date - Aug 20 , 2026 | 05:12 PM