వన్ వేపై సర్‌ప్రైజ్ చెక్.. సామాన్యుడిలా బైక్‌పై కేబీఆర్‌కు సీపీ సజ్జనార్
ABN , Publish Date - Aug 20 , 2026 | 04:24 PM
హెచ్-సిటీ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనుల కారణంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్- వే ట్రాఫిక్ విధానం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీపీ సజ్జనార్ వన్ వే ట్రాఫిక్‌పై సర్‌ప్రైజ్ చెక్ నిర్వహించారు.
హైదరాబాద్, ఆగస్టు 20: హెచ్-సిటీ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనుల కారణంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్- వే ట్రాఫిక్ విధానం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీపీ సజ్జనార్ వన్ వే ట్రాఫిక్‌పై సర్‌ప్రైజ్ చెక్ నిర్వహించారు. సామాన్యుడిలా బైక్‌పై ప్రయాణిస్తూ ట్రాఫిక్‌ను పర్యవేక్షించారు. రోడ్ నంబర్ 45 నుంచి ఫిల్మ్‌నగర్ వరకు బైక్‌పై రెండు సార్లు తిరుగుతూ ట్రాఫిక్‌ను పరిశీలించారు.
జంక్షన్‌లలో విధుల్లో ఉన్న పోలీసులతో ట్రాఫిక్‌పై సీపీ ఆరా తీశారు. మధ్యాహ్నం కూడా మరోసారి ట్రాఫిక్ సరళిపై పర్యవేక్షించారు. వన్‌వే కారణంగా తొలి రోజు వాహనదారులు కొంత అయోమయానికి గురైనప్పటికీ.. రెండో రోజు నుంచి రాకపోకలు సాఫీగా సాగుతున్నాయని సజ్జనార్ తెలిపారు. అన్ని జంక్షన్‌లలో స్పష్టమైన సైన్‌బోర్డులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తగినంత మంది ట్రాఫిక్ సిబ్బందిని మోహరించినట్లు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ, నిర్మాణ సంస్థ సమన్వయంతో H-CITY పనులు జరుగుతున్నాయన్నారు. పనులు పూర్తయ్యే వరకు వాహనదారులు సహకారించాలని కోరారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని ప్రజలకు సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి...
ఎస్‌సీబీఏ సీనియర్ ఎగ్జక్యూటివ్ సభ్యుడిగా రవిశంకర్ ఎన్నిక
మంత్రి పొంగులేటి క్షమాపణ చెప్పడం సిగ్గుచేటు: ఎంపీ లక్ష్మణ్
Read Latest Telangana News And Telugu News