ఎస్‌సీబీఏ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా రవిశంకర్ ఎన్నిక
ABN , Publish Date - Aug 20 , 2026 | 01:38 PM
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికల్లో జంధ్యాల రవిశంకర్ ఘన విజయం సాధించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 20: సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) కార్యవర్గ ఎన్నికల్లో జంధ్యాల రవిశంకర్ ఘన విజయం సాధించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జంధ్యాల రవిశంకర్.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర విద్యను పూర్తి చేసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్లు, గవర్నర్లకు న్యాయ సలహాదారుగా రవిశంకర్ విశేష సేవలు అందించారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో ఆయన వాదనలు వినిపించారు.
గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో ఆయన వాదనలు వినిపించారు. 2023 నుంచి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న రవిశంకర్ పలు కీలక కేసుల్లో వాదనలు వినిపించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తరఫున సుప్రీంకోర్టులో వాదించారు. తెలంగాణలోనూ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన పిటిషన్లలో అసెంబ్లీ స్పీకర్ తరఫున జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
అనకాపల్లి జిల్లాలో BARC ప్రాజెక్టుకు రిలీఫ్.. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు
ఏపీలో మిలాద్-ఉన్-నబి సెలవు తేదీ మార్పు..
Read Latest AP News And Telugu News