Share News

ఏపీలో మిలాద్‌-ఉన్‌-నబి సెలవు తేదీ మార్పు..

ABN , Publish Date - Aug 20 , 2026 | 01:28 PM

మిలాద్‌-ఉన్‌-నబి పండుగకు సంబంధించిన సెలవు తేదీని మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా ప్రకటించిన ఆగస్టు 25కు బదులుగా ఆగస్టు 26వ తేదీని(బుధవారం) సాధారణ సెలవు దినంగా ప్రకటించింది.

ఏపీలో మిలాద్‌-ఉన్‌-నబి సెలవు తేదీ మార్పు..
AP Government Holidays

అమరావతి, ఆగస్టు 20: మిలాద్‌-ఉన్‌-నబి పండుగకు సంబంధించిన సెలవు తేదీని మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా ప్రకటించిన ఆగస్టు 25కు బదులుగా ఆగస్టు 26వ తేదీని(బుధవారం) సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. చంద్ర దర్శనం ఆధారంగా ఈ ఏడాది మిలాద్‌-ఉన్‌-నబి పండుగ ఆగస్టు 26న వస్తుందని ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు ప్రభుత్వానికి తెలియజేసింది. సెలవు తేదీని సవరించాలని వక్ఫ్ బోర్డు సీఈఓ చేసిన విజ్ఞప్తి మేరకు సెలవు తేదీని సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 26ను సాధారణ సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె. శ్యామల రావు అధికారికంగా జీవో జారీ చేశారు.


ఇవి కూడా చదవండి...

అయ్యో పాపం.. ఫ్లోర్, లిఫ్ట్‌కి మధ్యలో ఇరుక్కుని

అనకాపల్లి జిల్లాలో BARC ప్రాజెక్టుకు రిలీఫ్.. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 20 , 2026 | 02:02 PM