Share News

సీఎం చంద్రబాబు ఆదర్శ పాలన అందిస్తున్నారు: ఎంపీ శ్రీభరత్

ABN , Publish Date - Aug 20 , 2026 | 03:25 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష పద్ధతిలో జడ్పీ ఎన్నిక జరగాలంటూ ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ శ్రీభరత్ అభినందించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని తెలిపారు.

సీఎం చంద్రబాబు ఆదర్శ పాలన అందిస్తున్నారు: ఎంపీ శ్రీభరత్
MP Sri Bharat

విశాఖపట్నం, ఆగస్టు 20: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష పద్ధతిలో జడ్పీ ఎన్నిక జరగాలంటూ ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ శ్రీభరత్ అభినందించారు. ఈరోజు(గురువారం) విశాఖ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఎంపీ తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని కొనియాడారు.


గత ప్రభుత్వం చేసిన అరాచకాలు నుంచి రాష్ట్రం ఇంకా పూర్తిగా రికవరీ అవ్వలేదని ఎంపీ అన్నారు. రాష్ట్రంలో మంచి ప్రతిపక్షం లేదని... ప్రతిపక్షంలో ఉన్నవారికి వారి పాత్ర అర్ధం కావడం లేదని చెప్పుకొచ్చారు. ఎల్‌నినో వలన నీటి సమస్య తలెత్తుతోందన్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని డేటా సెంటర్ల వలన నీటి సమస్య వస్తోందని కొన్ని శక్తులు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. డేటా సెంటర్లు రావడానికి ఇంకా రెండు సంవత్సరాల సమయం పడుతుందని తెలిపారు. వర్షాలపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. పోలవరం నీటిని విశాఖకు తీసుకువస్తున్నారని, నదులన్నీ అనుసంధానం అయిన తర్వాత దక్షిణ భారతదేశంలో నీటి సమస్య తగ్గుతుందని ఎంపీ శ్రీభరత్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

ఏపీలో మిలాద్‌-ఉన్‌-నబి సెలవు తేదీ మార్పు..

ఎస్‌సీబీఏ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగా రవిశంకర్ ఎన్నిక

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 20 , 2026 | 04:33 PM