Share News

‘ఇంటింటికీ’లో కూటమి రికార్డు

ABN , Publish Date - Aug 01 , 2026 | 08:33 AM

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికీ కార్యక్రమంలో కూటమి పార్టీలు రికార్డు సృష్టించాయి. 5 రోజుల్లో 12 లక్షల ఇళ్లను సందర్శించడం ద్వారా ఈ రికార్డు సృష్టించారు.

‘ఇంటింటికీ’లో కూటమి రికార్డు
Intintiki Program

  • 5 రోజుల్లో 12 లక్షల ఇళ్ల సందర్శన!

అమరావతి, జూలై 31(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికీ కార్యక్రమంలో కూటమి పార్టీలు రికార్డు సృష్టించాయి. 5 రోజుల్లో 12 లక్షల ఇళ్లను సందర్శించడం ద్వారా ఈ రికార్డు సృష్టించారు. శుక్రవారం ఒక్క రోజే 2.80 లక్షల ఇళ్లను సందర్శిచారు. ఐదో రోజు కార్యక్రమంలో టీడీపీతోపాటు జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను పార్టీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లోకేశ్‌ అభినందించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధిని, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని లోకేశ్‌ పిలుపునిచ్చారు.

Updated Date - Aug 01 , 2026 | 08:34 AM