బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులు
ABN , Publish Date - Feb 18 , 2026 | 08:49 PM
వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులు పంపించింది. బొత్సకు హెరిటేజ్ సంస్థ తరపున న్యాయవాది జి. మల్లిఖార్జున్‌రావు లీగల్ నోటీసులు పంపించారు.
అమరావతి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు (Botcha Satyanarayana) హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులు (Heritage Legal Notice) పంపించింది. బొత్సకు హెరిటేజ్ సంస్థ తరపున న్యాయవాది జి. మల్లిఖార్జున్‌రావు లీగల్ నోటీసులు పంపించారు. అసత్య, నిరాధార ఆరోపణలతో సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రకు పాల్పడ్డారంటూ బొత్సకు హెరిటేజ్ లీగల్ నోటీసులు పంపించింది. అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ దశాబ్దాలుగా ప్రజల నమ్మకాన్ని పొందిన హెరిటేజ్ సంస్థపై తప్పుడు ప్రచారంపై ఆయన సమాధానం చెప్పాలంటూ నోటీసులో తెలిపింది. హెరిటేజ్ సంస్థను చట్టబద్ధంగా నడుపుతూ పారదర్శక విధానాలతో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు, గుర్తింపు పొందిందని హెరిటేజ్ సంస్థ పేర్కొంది.
పూర్తి స్థాయిలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ దేశంలోనే ప్రీమియం బ్రాండ్‌గా హెరిటేజ్ గుర్తింపు పొందిందని తెలిపింది. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స ఇతర వైసీపీ నేతలతో కలిసి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో తప్పుడు వ్యాఖ్యలతో సంస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా అసంబద్ధ ఆరోపణలు చేశారని నోటీసులో పేర్కొంది హెరిటేజ్ సంస్థ. ఇందాపూర్ డైరీతో ఎటువంటి సంబంధం లేకపోయినా 2014 - 2019 మధ్య ఆ సంస్థ పేరుతో హెరిటేజ్ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందంటూ తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పింది.
22 సంస్థలతో హెరిటేజ్ సిండికేట్ ఏర్పాటు చేసిందంటూ 33 ఏళ్ల చరిత్ర కలిగిన సంస్థపై నిరాధార ఆరోపణలు చేశారని హెరిటేజ్ సంస్థ తెలిపింది. పదేపదే తప్పుడు ఆరోపణలతో హెరిటేజ్‌పై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా ఆరోపణలు చేశారని నోటీసులో ప్రస్తావించింది. సెక్షన్ 356 ఆఫ్ బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం సంస్థకు పరువు నష్టం కలిగించినందుకు బొత్స సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. తక్షణమే బొత్స చేసిన నిరాధార ఆరోపణలకు క్షమాపణ చెప్పి ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరింది. లేని పక్షంలో బొత్సపై సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తీసుకుంటుందంటూ నోటీసులో హెరిటేజ్ సంస్థ స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి...
టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం: హోంమంత్రి అనిత
మంత్రి నారా లోకేశ్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు..
Read Latest Telangana News And AP News And Telugu News