Share News

మెడికోలను వాహనంతో ఢీ కొట్టిన నిందితులపై కఠిన చర్యలు: సీఎం ఆదేశం

ABN , Publish Date - Aug 07 , 2026 | 01:28 PM

రాజమహేంద్రవరంలో మెడికోలను వాహనంతో ఢీ కొట్టిన ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

మెడికోలను వాహనంతో ఢీ కొట్టిన నిందితులపై కఠిన చర్యలు: సీఎం ఆదేశం

అమరావతి, ఆగస్టు 07: రాజమహేంద్రవరంలో మెడికోలను వాహనంతో ఢీ కొట్టిన ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఈ ఘటనపై ఆయన ఆరా తీశారు. బాధిత మెడికోలు ప్రియాంక, ఉమేష్ ఆరోగ్య పరిస్థితిని ఉన్నతాధికారులను అడిగి సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. మెడికోలు తీవ్రంగా గాయపడడం బాధాకరమని అన్నారు. ఈ ఘటన జరిగిన తీరును సీఎంకు అధికారులు వివరించారు. మద్యం మత్తులో ఇద్దరు మెడికోలను కారుతో ఢీ కొట్టి అనంతరం పరారయ్యారని చెప్పారు.


నిందితులను వెంటనే అరెస్ట్ చేశామని సీఎంకు అధికారులు తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించ వద్దని వారికి సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మెడికో ప్రియాంక ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. వారికి అవసరమైన వైద్య సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.


బుధవారం రాత్రి రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్య మాల్‌కు ఇద్దరు యువకులు బాగా తాగి వెళ్లారు. వీరి పరిస్థితిని చూసిన మాల్ సిబ్బంది.. బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించి.. వారిని మాల్‌లోకి అనుమతించలేదు. దాంతో మాల్ సిబ్బందిపై వారు కోపంతో రగిలిపోయారు. కారును వేగంగా పోనిచ్చారు. సరిగ్గా అదే సమయంలో గేటు ముందు నుంచి వెళ్తున్న స్కూటీని కారుతో బలంగా ఢీకొట్టారు. ఓవర్ స్పీడ్‌తో స్కూటీనీ మళ్లీ ఢీకొట్టారు. దాంతో స్కూటీ వెనుక ఉన్న మెడికో కింద పడిపోయింది. దీంతో ఆమెకు తీవ్రంగా గాయపడింది.


మూడోసారి అదే స్పీడ్‌తో ఆమె తలపై నుంచి కారు పోనిస్తూ ముందుకెళ్లారు. దాంతో ఆమె బ్రెయిన్ డెడ్ అయింది. ప్రస్తుతం ఐసీయూలో ఆమె చికిత్స పొందుతుంది. ఇక స్కూటీ నడిపిన ఆమె స్నేహితుడు ఉమేష్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు.. రాజమండ్రి సమీపంలోని నామవరానికి చెందిన వారిని పోలీసులు చెప్పారు. బ్రెయిన్ డెడ్ అయిన ప్రియాంక.. రాజమండ్రిలోని జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతోంది. ప్రియాంకు మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ తరలించిన సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

చేనేత వైభవాన్ని మళ్లీ తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఆగిన మగ్గం చప్పుడు

For More AP News And Telugu News

Updated Date - Aug 07 , 2026 | 01:46 PM