విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు అందిపుచ్చుకోవాలి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Apr 30 , 2026 | 04:33 PM
రాష్ట్రంలోని విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. కోర్సుల ఫోర్ క్యాస్టింగ్ జరగాలని ఉన్నతాధికారులకు ఆయన స్పష్టం చేశారు.
అమరావతి,ఏప్రిల్ 30: రాష్ట్రంలోని విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. కోర్సుల ఫోర్ క్యాస్టింగ్ జరగాలని ఉన్నతాధికారులకు ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి యూనివర్సిటీలతో రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలు పోటీ పడేలా చర్యలు తీసుకోవాలని వారిని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గురువారం రాజధాని అమరావతిలోని సచివాలయంలో పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్య తదితర శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రీసెర్చ్, ఇన్నోవేషన్, స్టార్టప్‌లను ప్రోత్సహించేలా విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవాలని ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. క్వాంటం టెక్నాలజీ కోర్సు ఆంధ్రా యూనివర్సిటీ ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కోర్సును ప్రారంభించిన ఆంధ్రా యూనివర్సిటీని సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ సమీక్షలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీకి కేంద్రం భారీగా నిధులు.. స్పందించిన కేంద్ర మంత్రి
ఉస్మానియాలో అరుదైన సర్జరీ.. వైద్య బృందానికి మంత్రి దామోదర్ ప్రశంసలు..
Read Latest AP News And Telugu News