స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల గెలుపే లక్ష్యం.. టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు
ABN , Publish Date - Oct 21 , 2026 | 05:20 PM
స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. జనసేన, బీజేపీలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అభ్యర్థుల ఎంపిక మొదలుకుని.. ఫలితాల వరకు ప్రతి అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని తెలిపారు.
అమరావతి, అక్టోబర్ 21: స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. జనసేన, బీజేపీలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అభ్యర్థుల ఎంపిక మొదలుకుని.. ఫలితాల వరకు ప్రతి అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని తెలిపారు. కూటమి నుంచి మంచి అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నామని.. పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యమిస్తున్నామని వివరించారు. బుధవారం రాజధాని అమరావతిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అభ్యర్ధులు, బూత్ స్థాయి కార్యకర్తలతో టీడీపీ అధినేత టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుపై వారికి దిశా నిర్దేశం చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు.. వైసీపీ వక్రీకరణలపై ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. రాజకీయాల్లో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ లాంటి క్రిమినల్ లిటిగెంట్స్ ఉంటే ప్రమాదకరమని పేర్కొన్నారు. విధ్వంసకారులను అభ్యర్థులుగా ఎంపిక చేసి.. వారిని గొడ్డలి పార్టీ బరిలోకి దించుతోందని విమర్శించారు. లిటిగెంట్లతో అభివృద్ధిని.. ఎన్నికలను అడ్డుకోవడమే గొడ్డలి పార్టీ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. తానే విధ్వంసానికి దిగి.. తానే కోర్టుకు వెళ్లడమనే ఆలోచనలు వైఎస్ జగన్ లాంటి క్రిమినల్ లిటిగెంట్లకే వస్తాయని వ్యంగ్యంగా అన్నారు. ఇలాంటి క్రిమినల్ లిటిగెంట్లు ఉన్నప్పుడు పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని పెదవి విరిచారు.
కోర్టు తీర్పులను కూడా వక్రీకరించేలా గొడ్డలి పార్టీ కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిమినల్ లిటిగెంట్లు రాజకీయాల్లో ఉంటే అభివృద్ధి చేయడానికి.. సంక్షేమం అందించడానికి అడ్డంకులు కల్పిస్తారని అన్నారు. సర్‌పై విమర్శలు చేశారు.. దీనిపై నమ్మకం లేదన్నారని.. మరో వైపు ఇదే సర్ జాబితా వచ్చే వరకు స్థానిక ఎన్నికలను జరుపకూడదంటూ వైసీపీ కోర్టుకు వెళ్తుందని చెప్పారు. ఓటరు లిస్ట్‌పై కోర్టుకు వెళ్లారు.. బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నారు.. ఇలా సుమారు 60 పిటిషన్లు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వేశారని వైసీపీ నేతల తీరును ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఎండగట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించేలా మెగా డీఎస్సీ రిక్రూట్మెంట్ చేస్తుంటే.. దాన్ని అడ్డుకునేలా దాదాపు 300 పిటిషన్లు వైసీపీ నేతలు వేశారని తెలిపారు.
అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులను అడ్డుకునేలా గొడ్డలి పార్టీ నేతలు కోర్టులకెళ్లారని.. లేఖలు కూడా రాశారని చెప్పారు. స్థానిక ఎన్నికలు జరుగుతుంటే.. మనం మంచి అభ్యర్థుల ఎంపికపై బిజీగా ఉంటే.. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మాత్రం బెంగళూరులో కూర్చొని విధ్వంస రచనలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఏయే మున్సిపాలిటీల్లో ఏవరిని అభ్యర్థులగా నియమించాలని మనం కసరత్తు చేస్తుంటే.. ఏయే ప్రాంతాల్లోకి ఏ రాష్ట్రం నుంచి గుండాలను దించాలో వైఎస్ జగన్ కుట్రలు పన్నుతున్నారని అన్నారు. విధ్వంసాలను అడ్డుకుంటే.. కోర్టులకెళ్లి ఎన్నికలను ఆపే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ నేతల తీరును ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఎండగట్టారు.
ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని వాళ్ల ఆలోచనలు ఇదే విధంగా ఉంటాయని వైఎస్ జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వికృత మనస్తత్వం కలిగిన వ్యక్తితో రాజకీయం చేయాల్సి వస్తోందంటూ ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వికృత మనస్తత్వం ఉన్నవారిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని అన్నారు. గొడ్డలి పార్టీని దూరంగా ఉంచాలంటే ప్రజలకు మనం చేసిన మంచిని నిరంతరం చెప్పాలని పేర్కొన్నారు.
అలాగే ఆ పార్టీ అరాచకాలను ప్రజలకు వివరించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల ప్రచారానికి వారం రోజుల సమయమే ఉందని.. అన్ని మున్సిపాలిటీల్లో ప్రచారం చేపట్టాలని శ్రేణులకు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయికి వెళ్లండి.. ప్రజల్లో ఉంటే మీకు తిరుగుండదని పార్టీ శ్రేణులకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విజయనగరం మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌పై ఎస్ఈసీ కీలక నిర్ణయం
స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు ఆదేశాలు.. ఎస్ఈసీ అత్యవసర భేటీ
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక ఎన్నికల్లో 90 శాతానికి పైగా స్థానాలు కూటమి అభ్యర్థులు కైవసం: దేవినేని ఉమా
విజయనగరం మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌పై ఎస్ఈసీ కీలక నిర్ణయం
For More AP News And Telugu News