Share News

కుప్పం ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి కంచర్ల శ్రీకాంత్ తొలగింపు

ABN , Publish Date - Jun 07 , 2026 | 08:40 PM

కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి కంచర్ల శ్రీకాంత్‌ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు తప్పించారు. ఆ స్థానంలో అనంతపురంకు చెందిన యంగ్ ప్రొఫెషనల్ శ్రీకాంత్‌ను సీఎం చంద్రబాబు నాయుడు నియమించారు.

కుప్పం ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి కంచర్ల శ్రీకాంత్ తొలగింపు
TDP MLC Kancharla Srikanth

అమరావతి,జూన్ 07: కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి కంచర్ల శ్రీకాంత్‌ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు తప్పించారు. ఆ స్థానంలో అనంతపురంకు చెందిన యంగ్ ప్రొఫెషనల్ శ్రీకాంత్‌ను సీఎం చంద్రబాబు నాయుడు నియమించారు. ఈ మేరకు ఆదివారం సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. తనను కుప్పం నియోజకవర్గం ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలంటూ సీఎం చంద్రబాబును గత కొన్ని నెలలుగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కోరుతున్నారు. ఈ రోజు రాజధాని అమరావతిలో కుప్పం నియోజకవర్గం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.


ఈ సందర్భంగా పలు అంశాలను సీఎం దృష్టికి నియోజకవర్గ నేతలు తీసుకెళ్లారు. అదే సమయంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అంశం కూడా చర్చకు వచ్చింది. దీంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఆయన స్థానంలో అనంతపురంకు చెందిన శ్రీకాంత్‌ను కుప్పం నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా నియమిస్తూ సీఎం చంద్రబాబు తాజాగా ఆదేశించారు. ఆయన మార్గదర్శనంలో నడవాలంటూ కుప్పం నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీజేపీ పోరుబాటతో దిగొచ్చిన రేవంత్ ప్రభుత్వం: ఎమ్మెల్యే ఏలేటి

కూటమి నేతలతో జూమ్ మీటింగ్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Read Latest AP News  And Telugu News

Updated Date - Jun 07 , 2026 | 09:35 PM