Share News

బీజేపీ పోరుబాటతో దిగొచ్చిన రేవంత్ ప్రభుత్వం: ఎమ్మెల్యే ఏలేటి

ABN , Publish Date - Jun 07 , 2026 | 07:53 PM

రాష్ట్రంలో నిర్వహించిన రైతు గోస - బీజేపీ భరోసా పోరుబాటతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగొచ్చిందని తెలంగాణ శాసనసభలో బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈ యాత్ర ద్వారా ప్రభుత్వం మెడలు వంచామన్నారు.

బీజేపీ పోరుబాటతో దిగొచ్చిన రేవంత్ ప్రభుత్వం: ఎమ్మెల్యే ఏలేటి
BJP MLA Alleti Maheshwar Reddy,

హైదరాబాద్, జూన్ 07: రాష్ట్రంలో నిర్వహించిన రైతు గోస - బీజేపీ భరోసా పోరుబాటతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగొచ్చిందని తెలంగాణ శాసనసభలో బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈ యాత్ర ద్వారా ప్రభుత్వం మెడలు వంచామన్నారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజా పోరాటాలు చేస్తామన్నారు. రైతు డిక్లరేషన్, మద్దతు ధర అమలు జరిగే వరకు బీజేపీ పోరు కొనసాగుతోందని ఆయన కుండబద్దలు కొట్టారు.


సర్ ప్రక్రియ మీద చర్చించామని చెప్పారు. దాదాపు రూ.12 వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని విద్యార్థుల కోసం బీజేపీ భరోసా యాత్ర చేస్తానని ఆయన ప్రకటించారు. విద్యార్థులతో నేరుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖాముఖిగా మాట్లాడేందుకు ఒక కార్యాచరణ సిద్ధం చేస్తానని వివరించారు. జిల్లాల వారీగా విద్యార్థులను నేతలందరం కలిసి వారి సూచనలు, సమస్యలు అడిగి తెలుసుకుని పోరాటంపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామన్నారు. ‌‌


ఈ వార్తలు కూడా చదవండి..

కూటమి నేతలతో జూమ్ మీటింగ్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదు: కాంగ్రెస్ ఎమ్మెల్యే

Read Latest AP News  And Telugu News

Updated Date - Jun 07 , 2026 | 08:04 PM