Share News

కూటమి నేతలతో జూమ్ మీటింగ్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Jun 07 , 2026 | 07:02 PM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు, నరేంద్ర మోదీ ప్రధానిగా పాలన పగ్గాలు చేపట్టి 12 ఏళ్ల అయింది. ఈ నేపథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పాలన విజయాలపై రాష్ట్రంలో నిర్వహించే బహిరంగసభలను విజయవంతం చేయాలని కూటమిలోని రాజకీయ పక్షాల నేతలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు.

కూటమి నేతలతో జూమ్ మీటింగ్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu Naidu

అమరావతి, జూన్ 07: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు, నరేంద్ర మోదీ ప్రధానిగా పాలన పగ్గాలు చేపట్టి 12 ఏళ్ల అయింది. ఈ నేపథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పాలన విజయాలపై రాష్ట్రంలో నిర్వహించే బహిరంగసభలను విజయవంతం చేయాలని కూటమిలోని రాజకీయ పక్షాల నేతలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆదివారం రాజధాని అమరావతిలో కూటమి పక్షాల నేతలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ 9 వ తేదీన తిరుపతి వేదికగా జరగనున్న భారీ బహిరంగ సభ గురించి వారితో చర్చించారు.


ఈ సభకు ఆయా పార్టీల కార్యకర్తలందరిని ఆహ్వానించాలని వారిని కోరారు. అలాగే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారికి సోదాహరణగా వివరించాలని వారికి సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మూడు ప్రాంతాలలో నిర్వహించే సభలను విజయవంతం చేయాలని వారిని సీఎం చంద్రబాబు కోరారు. టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ పి. హరిప్రసాద్, బీజేపీ నుంచి పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు.


జూన్ 4వ తేదీన ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో కూటమిలోని పార్టీల అగ్రనేతలు సమావేశమయ్యారు. ఏపీలో రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనతోపాటు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటై 12 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నేతలు చర్చించారు. అలాగే కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతల విమర్శల జోరుకు అడ్డుకట్ట వేయాలని భావించారు.


ఈ నేపథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో జూన్ 9వ తేదీన తిరుపతిలో.. జూన్12వ తేదీన రాజధాని అమరావతిలో.. జూన్ 15వ తేదీన విశాఖపట్నం వేదికగా ఈ భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దాంతో ఈ సభలను విజయవంతం చేయాలని ఈ జూమ్ మీటింగ్‌లో ఆయా పార్టీల అగ్రనేతలను సీఎం చంద్రబాబు ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జూన్ 9 నుంచి 30 వరకు ఆంధ్రా ప్రీమియర్ లీగ్ మ్యాచ్: ఎంపీ కేశినేని చిన్ని

బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదు: కాంగ్రెస్ ఎమ్మెల్యే

Read Latest AP News  And Telugu News

Updated Date - Jun 07 , 2026 | 07:17 PM