వాతావరణ మార్పులకు తగినట్టు భవన నిర్మాణం జరగాలి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 20 , 2026 | 08:19 PM
వాతావరణ మార్పులకు తగినట్టుగా భవనాల నిర్మాణం జరగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. భవిష్యత్‌లో ప్రతి భవనంపై సోలార్ రూఫ్ టాప్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.
బెంగళూరు, సెప్టెంబర్ 20: వాతావరణ మార్పులకు తగినట్టుగా భవనాల నిర్మాణం జరగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. భవిష్యత్‌లో ప్రతి భవనంపై సోలార్ రూఫ్ టాప్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. గత 11ఏళ్లుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని ఈపీఐపీ (EPIP) జోన్‌లో ది ఎర్త్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ ఏడాది వాతావరణం చాలా ప్రతికూలంగా ఉందని తెలిపారు. వేస్టేజ్ నుంచి ఎనర్జీ ఉత్పత్తి చేయాలని పేర్కొన్నారు.
ప్రకృతి, టెక్నాలజీతో ది ఎర్త్ సెంటర్‌ను నిర్మించారు. సస్టైనబుల్ డిజైన్‌తో ది ఎర్త్ సెంటర్ రూపుదిద్దుకుంది. 10.54 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. టవర్ A, టవర్ Bగా ది ఎర్త్ సెంటర్ అభివృద్ధి చేశారు. బయోఫిలిక్ డిజైన్‌తో ఈ సెంటర్‌ను నిర్మించారు. పచ్చదనం, సహజ కాంతికి ది ఎర్త్ సెంటర్ నిర్వహణ. టెర్రకోటా స్క్రీన్స్‌తో ప్రత్యేకంగా ది ఎర్త్ సెంటర్ ముఖభాగాన్ని ఏర్పాటు చేశారు. ఎనర్జీ వినియోగాన్ని తగ్గించేలా ది ఎర్త్ సెంటర్ డిజైన్ చేశారు. అలాగే వర్షపు నీటి సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆఫీస్, కేఫ్, డైనింగ్, రిటైల్ సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. వెల్‌నెస్, మీటింగ్, ఈవెంట్ స్పేస్‌లతో ఆధునిక వర్క్‌స్పేస్‌ను నిర్మించారు. LEED Platinum స్థాయి సస్టైనబుల్ బిల్డింగ్‌గా ది ఎర్త్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
క్యాన్సర్ చికిత్సలో మరో ముందడుగు.. జీజీహెచ్‌లో ఉచిత జన్యు పరీక్షలు
ప్రజల భూమిని లాక్కునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: మంత్రి పొంగులేటి
Read Latest AP News And Telugu News