Share News

క్యాన్సర్ చికిత్సలో మరో ముందడుగు.. జీజీహెచ్‌లో ఉచిత జన్యు పరీక్షలు

ABN , Publish Date - Sep 20 , 2026 | 06:44 PM

క్యాన్సర్ చికిత్సలో భాగంగా రోగులకు అధునాతన జన్యు పరీక్షలు నిర్వహణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో వైద్య రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులకు నిదర్శమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.

క్యాన్సర్ చికిత్సలో మరో ముందడుగు.. జీజీహెచ్‌లో ఉచిత జన్యు పరీక్షలు

గుంటూరు, సెప్టెంబర్ 20: క్యాన్సర్ చికిత్సలో భాగంగా రోగులకు అధునాతన జన్యు పరీక్షలు నిర్వహణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో వైద్య రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులకు నిదర్శమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. సోమవారం గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్) ప్రాంగణంలో నాట్కో క్యాన్సర్ కేర్ సెంటర్‌లో జన్యు పరీక్షలను ఆయన ప్రారంభించనున్నారు. భవిష్యత్తులో రాజధాని అమరావతి క్వాంటం వ్యాలీలో పూర్తి స్థాయి కేంద్రం ఏర్పాటుపై ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.


నాట్కో క్యాన్సర్ కేర్ సెంటర్‌లో రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్లకు జన్యు మార్పులను ఈ పరీక్షల ద్వారా గుర్తిస్తారు. ప్రస్తుతం ఖరీదైన జన్యు పరీక్షలు ప్రైవేట్ వైద్య సంస్థల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అత్యధిక ఖర్చుతో కూడిన ఈ సేవలను ప్రభుత్వాసుపత్రిలో రోగులకు ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణకు వర్ష సూచన.. వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

కేసీఆర్ కుటుంబ సభ్యుల భూముల విచారణపై కట్టుబడి ఉన్నాం: మహేశ్ గౌడ్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 07:20 PM