Share News

వైసీపీ హైకోర్టుకు వెళ్లకుంటే న్యాయం జరిగేది: మంత్రి అచ్చెన్నాయుడు

ABN , Publish Date - Oct 10 , 2026 | 02:03 PM

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో గొడ్డలి పార్టీ హైకోర్టుకు వెళ్లకపోయి ఉంటే.. బలహీనవర్గాలకు న్యాయం జరిగేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. బీసీలకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు.

వైసీపీ హైకోర్టుకు వెళ్లకుంటే న్యాయం జరిగేది: మంత్రి అచ్చెన్నాయుడు
atchannaidu kinjarapu

అమరావతి, అక్టోబర్10: స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో గొడ్డలి పార్టీ హైకోర్టుకు వెళ్లకపోయి ఉంటే.. బలహీనవర్గాలకు న్యాయం జరిగేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. బీసీలకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు. గొడ్డలి పార్టీకి ఈ ఎన్నికలు జరగడం ఇష్టం లేదని విమర్శించారు. ఈ ఎన్నికలు జరిగితే ఉన్న పది మంది కూడా పార్టీ వీడి వెళ్లిపోతారని భయం మొదలైందన్నారు. డెడికేషన్‌ కమిషన్‌ రిపోర్ట్‌ ఇచ్చిందని.. దీనికి కేబినెట్‌లో ఆమోదం తెలిపామని అన్నారు. శనివారం వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు విలేకర్లతో మాట్లాడుతూ.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల జరగనున్నాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించాలన్నది ఎన్డీయే ఉద్దేశమని స్పష్టం చేశారు.


బీసీలకు మొదటి నుంచి అండగా ఉన్నది టీడీపీ అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 1987లో మొదటిసారి బీసీలకు ఎన్టీఆర్‌ రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. 20 శాతం ఉన్న రిజర్వేషన్లను 34 శాతానికి సీఎం చంద్రబాబు పెంచారని వివరించారు. గత ప్రభుత్వం రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడ్డలి పార్టీకి బలహీనవర్గాలు అంటే చిన్నచూపు అంటూ మండిపడ్డారు. 2019లో బీసీలపై జరిగిన దమనకాండ గతంలో ఎప్పుడూ చూడలేదని చెప్పారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని అన్నారు. తామిచ్చిన జీవోలపై హైకోర్టుకు వెళ్లకుంటే.. ఇప్పటికే స్థానిక ఎన్నికలు జరిగి ఉండేవని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీ హయాంలో వీళ్ల ఆటలు సాగవు: నితిన్‌ నబీన్‌

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు కట్టుబడి ఉన్నాం: మంత్రి కొల్లు రవీంద్ర

Updated Date - Oct 10 , 2026 | 02:11 PM