ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌తో పరిశ్రమల హబ్‌గా విశాఖ ప్రాంతం: మంత్రి అనగాని
ABN , Publish Date - Mar 23 , 2026 | 10:55 AM
ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ రాకతో విశాఖ ప్రాంతం పరిశ్రమల హబ్‌గా మారుతోందని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు.
అమరావతి, మార్చి 23: ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ రాకతో విశాఖ ప్రాంతం పరిశ్రమల హబ్‌గా మారుతోందని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్, యువ నేత, మంత్రి నారా లోకేశ్ కష్టానికి ప్రతిఫలం ఈ ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అని ఆయన పేర్కొన్నారు. సోమవారం రాజధాని అమరావతిలో మంత్రి అనగాని సత్య ప్రసాద్ విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి చరిత్రలో నేడు ఓ గొప్ప మైలురాయి అని ఆయన అభివర్ణించారు.
ఉక్కు రంగంలో రాష్ట్రానికి రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన జరగనుందని మంత్రి అనగాని వివరించారు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో సోమవారం మధ్యాహ్నం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమార స్వామితో కలిసి సీఎం చంద్రబాబు ఈ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులతోపాటు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా లక్ష మందికిపైగా ఉపాధి కలగనుంది. ఈ స్టీల్ ప్లాంట్‌కు అనుబంధంగా రూ.11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్ట్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో మరో 6 వేల ఉద్యోగాలు క్యాప్టివ్ పోర్ట్ ద్వారా రానున్నాయి. ఇక ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా లక్ష మందికిపైగా ఉపాధి కలగనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కత్తితో దాడి.. గంజాయి బ్యాచ్ వీరంగం
మండుతున్న ఎండలు.. కూలర్లకు మరమ్మతులు
For More AP News And Telugu News