ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 11 , 2026 | 08:47 PM
స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 అవార్డులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 6 జాతీయ అవార్డులను దక్కించుకోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 10వ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.
అమరావతి, నవంబర్11: స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 అవార్డులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 6 జాతీయ అవార్డులను దక్కించుకోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 10వ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మంత్రి నారాయణ, ఏపీ మున్సిపల్ శాఖ కార్యదర్శి సురేశ్ కుమార్ అవార్డులు అందుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు.
‘విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లకు, కుప్పం మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు. పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది, ఉద్యోగులు, అధికారుల శ్రమ, పనితీరు వల్లనే ఈ ఘనత సాధ్యమైంది’.
‘6 జాతీయ అవార్డులు దక్కించుకోవడం గర్వకారణం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి, ఆ శాఖ ఉన్నతాధికారులకు అభినందనలు. ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో మళ్లీ మున్సిపల్ ఎన్నికలు.. రెండ్రోజుల్లో నోటిఫికేషన్
3.5 కిలోల బంగారం, 380 క్యారెట్ల వజ్రాలతో ఖరీదైన ముగ్గు.. వీడియో వైరల్
For More AP News And Telugu News