ఏపీలో మళ్లీ మున్సిపల్ ఎన్నికలు.. రెండ్రోజుల్లో నోటిఫికేషన్
ABN , Publish Date - Nov 11 , 2026 | 03:34 PM
కోర్టు వివాదాలు క్లియర్ కావడంతో.. పలు పురపాలక సంఘాలతోపాటు వివిధ నగరపాలక సంస్థలకు పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) బుధవారం నిర్ణయించింది. నవంబర్ 26వ తేదీన వీటికి పోలింగ్ చేపట్టాలని నిర్ణయించింది.
అమరావతి, నవంబర్11: కోర్టు వివాదాలు క్లియర్ కావడంతో.. పలు పురపాలక సంఘాలతోపాటు వివిధ నగరపాలక సంస్థలకు పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) బుధవారం నిర్ణయించింది. నవంబర్ 26వ తేదీన వీటికి పోలింగ్ చేపట్టాలని నిర్ణయించింది. నవంబర్ 26వ తేదీన పంచాయితీ ఎన్నికలు మొదటి దశ పోలింగ్ జరగనుంది. అదే రోజు ఈ నగరపాలక సంస్థలతోపాటు 23 పురపాలక సంఘాలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది.
నవంబర్ 13వ తేదీన అందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.
అలాగే ఆముదాలవలస, రాజాం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, చింతలపూడి, గుడివాడ, తాడిగడప, పొన్నూరు, నర్సరావుపేట, బాపట్ల, కందుకూరు, పొదిలి, కావలి, గుడూరు, అల్లూరు, శ్రీకాళహస్తి, బీ కొత్తకోట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ మున్సిపాలిటీల్లో ఇప్పటికే రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించిన కసరత్తును ఎస్ఈసీ ప్రారంభించింది.
మరోవైపు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 13 నగరపాలక సంస్థలు, 92 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కూటమి పార్టీలు సత్తా చాటాయి. అయితే కొన్ని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో న్యాయపరమైన వివాదాల కారణంగా ఎన్నికలు నిలిచిపోయాయి. ఆ కోర్టు కేసులు క్లియరయ్యాయి. దీంతో ఎన్నికల నిర్వహరణకు ఎస్ఈసీ రంగం సిద్ధం చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
3.5 కిలోల బంగారం, 380 క్యారెట్ల వజ్రాలతో ఖరీదైన ముగ్గు.. వీడియో వైరల్
గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..
For More AP News And Telugu News