ఎల్ నినోతో విద్యుత్ వినియోగం పెరిగింది: మంత్రి గొట్టిపాటి రవికుమార్
ABN , Publish Date - Jul 22 , 2026 | 08:49 PM
ఎల్ నినో ప్రభావంతో తగ్గిన జల విద్యుత్ ఉత్పత్తితో ఇబ్బందులు లేకుండా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పెంచాలని ఉన్నతాధికారులను ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. బుధవారం రాజధాని అమరావతిలో రాష్ట్రంలో నెలకొన్న ఎల్ నినో పరిస్థితులపై అధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష నిర్వహించారు.
అమరావతి, జులై 22: ఎల్ నినో ప్రభావంతో తగ్గిన జల విద్యుత్ ఉత్పత్తితో ఇబ్బందులు లేకుండా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పెంచాలని ఉన్నతాధికారులను ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. బుధవారం రాజధాని అమరావతిలో రాష్ట్రంలో నెలకొన్న ఎల్ నినో పరిస్థితులపై అధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష నిర్వహించారు. 15 రోజుల విద్యుత్ ఉత్పత్తికి తగిన విధంగా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రస్తుత రోజువారీ డిమాండ్ 280 మిలియన్ యూనిట్‌లకు అనుగుణంగా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆయన స్పష్టం చేశారు.
పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిపై విద్యుత్ అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నారు. ఎల్ నినోతో విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు. వర్షాభావ పరిస్థితులను సమర్దవంతంగా ఎదుర్కోవాలని వారికి సూచించారు. ట్రాన్స్ కో, జెన్కో, డిస్కంల సమన్వయంతో ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి వివరించారు. ఈ సమీక్ష సమావేశానికి ఏపీ ట్రాన్స్ కో, జెన్‌కో ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పొగాకు రైతుల గురించి జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది: మంత్రి డోలా
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
For More AP News And Telugu News