Share News

పొగాకు రైతుల గురించి జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది: మంత్రి డోలా

ABN , Publish Date - Jul 22 , 2026 | 08:27 PM

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, వారికి అన్ని విధాల అండగా నిలుస్తామని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. గతేడాది 25 మిలియన్ల బర్లీ పొగాకు రూ.304 కోట్లతో కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచామని పేర్కొన్నారు.

పొగాకు రైతుల గురించి జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది: మంత్రి డోలా
AP Minister Dola Bala Veeranjaneyulu Swamy

అమరావతి, జులై 22: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, వారికి అన్ని విధాల అండగా నిలుస్తామని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. బుధవారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. గతేడాది 25 మిలియన్ల బర్లీ పొగాకు రూ.304 కోట్లతో కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచామని పేర్కొన్నారు. జగన్ పాలనలో పొగాకు రైతులకు నష్టం తప్ప, జరిగిన మంచి శూన్యం అని గుర్తు చేశారు. పొగాకు రైతుల గురించి మాజీ సీఎం జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.


గత ప్రభుత్వ పాలనలో ఏనాడైనా పొగాకు రైతుల సమస్యలు పట్టించుకున్నారా? అని వైసీపీ అధినేతను ఈ సందర్భంగా మంత్రి డోలా సుటిగా ప్రశ్నించారు. పొగాకు కొనుగోళ్ల సమస్యపై సీఎం చంద్రబాబు వెంటనే బోర్డు అధికారులతో సమీక్షించారని వివరించారు. అలాగే కేంద్ర మంత్రులతో కూడా ఇదే అంశంపై మాట్లాడారని తెలిపారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలసి పొగాకు రైతులకు న్యాయం చేయాలని కోరామని ఈ సందర్భంగా చెప్పారు. అవసరమైతే వయబులిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరామని వివరించారు. కేంద్రం సానుకూలంగా స్పందించి ఆర్డర్లు లేకపోయినా రైతుల దగ్గర నుంచి పొగాకు మొత్తం కొనుగోలు చేయాలని ఆదేశించిందని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం బాటలు: కాల్వ శ్రీనివాసులు

For More AP News And Telugu News

Updated Date - Jul 22 , 2026 | 08:33 PM