Share News

గ్రామ పంచాయతీల్లో మొత్తం 2.61 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎస్ఈసీ

ABN , Publish Date - Nov 13 , 2026 | 03:03 PM

ఏపీలో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల షెడ్యూల్‌‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) శుక్రవారం ఉదయం ప్రకటించింది. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన పలు కీలక అంశాలను ఎస్ఈసీ వివరించింది.

గ్రామ పంచాయతీల్లో మొత్తం 2.61 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎస్ఈసీ
2,61,52,377 Gram Panchayat Voters In AP

విజయవాడ, నవంబర్13: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల షెడ్యూల్‌‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) శుక్రవారం ఉదయం ప్రకటించింది. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన పలు కీలక అంశాలను ఎస్ఈసీ వివరించింది.

  • మొత్తం ఓటర్ల సంఖ్య: రాష్ట్రంలో మొత్తం గ్రామ పంచాయతీల్లోని ఓటర్ల సంఖ్య: 2,61,52,377.

  • ఈ మొత్తం ఓటర్లలో.. పురుషులు:1,28,76,887, మహిళలు1,32,74,208, ఇతరులు1,282

  • మొత్తం సర్పంచ్ స్థానాలు.. 13,167 ఉన్నాయి. వార్డు సభ్యుల స్థానాల సంఖ్య 1,32,514.

  • మహిళా రిజర్వేషన్లు: సర్పంచ్ స్థానాల్లో మహిళలకు 6,445 సీట్లు, వార్డు సభ్యుల స్థానాల్లో మహిళలకు 66,170 సీట్లు కేటాయింపు.


  • ఎన్నికల షెడ్యూల్: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మొత్తం మూడు దశల్లో జరగనుంది.

  • పోలింగ్ తేదీలు: నవంబర్ 26న తొలి దశ, నవంబర్ 29న రెండో దశ, డిసెంబర్ 2న మూడో దశ పోలింగ్ నిర్వహించనున్నారు.

  • పోలింగ్, కౌంటింగ్ సమయం: ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. అనంతరం ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.

  • పోలింగ్ కేంద్రాలు: రాష్ట్రవ్యాప్తంగా మొత్తం1,34,847 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.


  • సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు: మొత్తం పోలింగ్ కేంద్రాల్లో అత్యంత సమస్యాత్మకమైనవి 28,568 కాగా, సమస్యాత్మక కేంద్రాలు 35,642గా గుర్తించారు.

  • సర్పంచ్ అభ్యర్థుల డిపాజిట్లు: సర్పంచ్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల డిపాజిట్ రూ.3,000, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.1,500.

  • వార్డు సభ్యుల డిపాజిట్లు: వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థుల డిపాజిట్ రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ. 500.

  • సర్పంచ్ ఖర్చు పరిమితి: 10 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థుల గరిష్ఠ ఖర్చు పరిమితి రూ. 2.50 లక్షలు,10 వేల జనాభా దాటిన చోట రూ. 4 లక్షలు.


  • వార్డు సభ్యుల ఖర్చు పరిమితి: వార్డు సభ్యులకు 10 వేల లోపు జనాభా ఉన్న చోట రూ. 60 వేలు, 10 వేలు దాటిన చోట రూ.1,00,000గా ఖర్చు పరిమితిని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ధారించింది.


ఇవి కూడా చదవండి..

ఏపీకి రూ.1.41 లక్షల కోట్ల పెట్టుబడులు..10,919 మందికి ఉద్యోగాలు

హైదరాబాద్‌కు బిల్ గేట్స్‌ను నేనే రప్పించా.. ఆనాడే ఐటీపై ఫోకస్ పెట్టా: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 13 , 2026 | 04:02 PM