Share News

గుడ్ న్యూస్.. మరో పథకం ప్రకటించిన సీఎం చంద్రబాబు..

ABN , Publish Date - Mar 05 , 2026 | 08:36 PM

ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే కాన్పు సమయంలో రూ.25వేలు ఇస్తామని గురువారం నాడు అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే..

గుడ్ న్యూస్.. మరో పథకం ప్రకటించిన సీఎం చంద్రబాబు..
CM Chandrababu Naidu population New Policy

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే కాన్పు సమయంలో రూ.25వేలు ఇస్తామని గురువారం నాడు అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేశారు. ప్రతి కుటుంబంలోని కుటుంబసభ్యుల సంఖ్య పెరిగే కొద్దీ వారికి ప్రోత్సాహకాలు ఉంటాయని చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటివరకూ కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యత ఇచ్చామని, ఇప్పుడు పాపులేషన్ మేనేజ్‌మెంట్ గురించి చర్చిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. పాపులేషన్ మేనేజ్ మెంట్ పాలసీ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందని తెలిపారు.


ప్రస్తుతం 1.5‌గా ఉన్న టీఎఫ్ఆర్‌ను 2.1కు తీసుకువెళ్లడమే ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో తన మాటలను వ్యతిరేకించిన జేపీ వంటి వారు ఇప్పుడు సమర్థిస్తున్నారని అన్నారు. ఇటీవల ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ కూడా పాపులేషన్ గురించి ప్రస్తావించారని గుర్తు చేశారు. ప్రస్తుతం మన దేశంలో యూపీ, బిహార్ లో మాత్రమే ఎక్కువ జనాభా ఉన్నారని చెప్పుకొచ్చారు. 2023 నివేదిక ప్రకారం ఏపీలో ఏడాదికి 6.70లక్షల మంది పిల్లలు మాత్రమే పుడుతున్నారని.. ఈ లెక్కన 2047 నాటికి ఏపీలో వృద్దుల సంఖ్య ఏ స్థాయిలో పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే జనాభా వృద్ధిపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.


ఇవి కూడా చదవండి...

లేట్‌ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన

అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా: స్పీకర్ అయ్యన్న పాత్రుడు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 05 , 2026 | 09:11 PM