ఏపీ కేబినెట్ భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయాలు
ABN , Publish Date - Aug 18 , 2026 | 02:44 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
అమరావతి, ఆగస్టు18: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అవి..
కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను పొందేందుకు పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను అత్యవసరంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
చట్టంలోని నిబంధనల ప్రకారం బీసీ రిజర్వేషన్లతోనే పట్టణ స్థానిక సంస్థలు (ULBs), గ్రామీణ స్థానిక సంస్థలు (RLBs) ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది.
గ్రామీణ స్థానిక సంస్థల్లో (RLBs) బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పనకు ఆమోదం తెలిపింది.
పట్టణ స్థానిక సంస్థల్లో (ULBs) బీసీలకు 33⅓ శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది.
ఏపీ పంచాయితీరాజ్ చట్టం-1994కు అనుగుణంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు నిర్ణయం తీసుకుంది.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించింది.
బీసీ రిజర్వేషన్లకు కోసం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని కేబినెట్ దృష్టికి ఉన్నతాధికారులు వెల్లడించారు.
పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది.
నగర, పట్టణ, నగర పంచాయితీల్లోని మేయర్, చైర్మన్ల ఎన్నిక ఇకపై ప్రత్యక్ష పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించింది.
ఇప్పటి వరకూ ఉన్న 13 జిల్లా పరిషత్‌ల సంఖ్యను 28కి పెంచాలని నిర్ణయం తీసుకుంది.
జిల్లాల విభజనకు అనుగుణంగా జెడ్పీలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది.
ఈ ఏడాది అక్టోబర్‌లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం
ఆర్థిక సంఘం నిధులు రూ.16,500 కోట్లు మరిగిపోకుండా ఉండేందుకు చర్యలు
మేయర్ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం
పాత పద్ధతిలో ఓ డిప్యూటీ మేయర్‌కే పరిమితం కావాలని నిర్ణయం
కర్నూలులో అగస్త్య గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం
12 గిగావాట్ల సిలికాన్ ఇంగాట్, వేఫర్ ప్లాంట్ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్
విశాఖలో అక్షత్ గ్రీన్‌టెక్ సోలార్ సెల్, మాడ్యూల్ ప్లాంట్, డేటా సెంటర్ల ప్రతిపాదనలు, SIPB నిర్ణయాలకు ఆమోదం.
తిరుపతి, సూర్యలంక, కేసరపల్లి, కాకినాడలో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు ఆమోద ముద్ర.
అమరావతి రైల్వేలైన్‌కు ల్యాండ్ పూలింగ్‌పై నిర్ణయం.
హ్యామ్ మోడల్‌లో రోడ్లు, పార్కుల అభివృద్ధిపై నిర్ణయం.
10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ప్రకటనపై నిర్ణయం
బీసీ విద్యార్థుల కోసం జేఈఈ, నీట్ సెంటర్ల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్
ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు బిల్లుకు ఆమోదం.
ఉన్నత విద్యలో ఫీజుల నిర్ణయానికి కొత్త కమిషన్ బిల్లుకు ఆమోదం.
APSBCLకు రూ.5 వేల కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రుణం ప్రతిపాదనకు ఆమోదం.
అవయవ మార్పిడికి సంబంధించి ట్రాన్స్‌ప్లాంటేషన్ బిల్లుకు ఆమోదం.
పరిశ్రమలు, ఐటీ, ఇంధనం, పర్యాటక రంగాలపై ఈ కేబినెట్‌లో విస్తృతంగా చర్చ జరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక ఎన్నికలపై మాధవ్ కీలక వ్యాఖ్యలు
వన్ వే కి సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదములు: సీపీ సజ్జనార్
For More AP News And Telugu News