అంగన్ వాడీలతో మంత్రి గుమ్మడి సంధ్యారాణి భేటీ
ABN , Publish Date - Mar 10 , 2026 | 09:34 PM
అంగన్‌వాడీ కార్యకర్తల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారు పెట్టిన 10 డిమాండ్లలో 9 నెరవేర్చిందని మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యా రాణి అన్నారు.
అమరావతి, మార్చి10: అంగన్‌వాడీ కార్యకర్తల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారు పెట్టిన 10 డిమాండ్లలో 9 నెరవేర్చిందని మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యా రాణి(Gummadi Sandhya Rani) అన్నారు. అన్ని హామీలు ప్రభుత్వం నెరవేర్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్ధిక ఇబ్బందులు దృష్ట్యా జీతాలు పెంపు హామీపై కొంత సమయం అవసరమని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలను పట్టించుకోకపోగా, వారిపై అక్రమ కేసులు బనాయించిందని మంత్రి గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులన్నీ చట్టపరంగా తొలగించేలా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.
ఆర్ధిక అంశాలతో ముడిపడిన హామీ కనుక కొంత సమయం పడుతుందని, అన్ని హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చర్చలకు సానుకూలంగా కొన్ని గ్రూపులు స్పందించగా, మరికొన్ని గ్రూపులు తక్షణమే జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఇదిలా ఉంటే.. తమ సమస్యలు ఉగాదిలోపు పరిష్కరించాలని అంగన్‌వాడీ ప్రతినిధులు మంత్రిని కోరారు. ఒకవేళ నిర్ణీత సమయంలోగా సమస్యలు పరిష్కారం కాకపోతే, దశల వారిగా ఉద్యమానికి సిద్ధమవుతామని వారు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు..
మూసీ పేరుతో మూటల వేటకు వ్యతిరేకం: కేటీఆర్
Read Latest AP News And Telugu News