పీవీ సింధును అభినందించిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 19 , 2026 | 06:46 PM
జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తెలుగు షట్లర్ పీవీ సింధును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఇది మరో చారిత్రాత్మక మైలురాయి అని ఆయన అభివర్ణించారు.
అమరావతి, జులై 19: జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తెలుగు షట్లర్ పీవీ సింధును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఇది మరో చారిత్రాత్మక మైలురాయి అని ఆయన అభివర్ణించారు. ఈ ఆటలో పీవీ సింధు అద్భుత ప్రదర్శన కనబరిచిందని హర్షం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌లోనూ ఇదే జోరు పీవీ సింధు కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.
‘ఆల్ ది బెస్ట్ ఫర్ ఒలింపిక్స్ అమ్మా’ అంటూ సింధుకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌కు మరోసారి పీవీ సింధు గర్వకారణంగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు తన ఎక్స్ ఖాతా వేదికగా పీవీ సింధుకు అభినందనలు తెలిపారు. యమగుచిపై 21-17, 21-17తో వరుస గేమ్‌లలో పీవీ సింధు విజయం సాధించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాయలసీమకు అసలైన ముద్దుబిడ్డ ఎన్టీ రామారావు: బైరెడ్డి రాజశేఖరరెడ్డి
భూత్పూర్‌లోని పౌల్ట్రీఫారంపై ఈగల్ ఫోర్స్ దాడి.. అల్ఫ్రాజోలం స్వాధీనం
For More AP News And Telugu News