Share News

రాజమండ్రి నగరపాలక సంస్థపై బీజేపీ జెండా ఎగురవేస్తాం: ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్

ABN , Publish Date - Nov 13 , 2026 | 03:50 PM

రాజమండ్రి నగరపాలక సంస్థపై బీజేపీ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. స్థానిక అభ్యర్థికే మేయర్ టికెట్ కేటాయిస్తామని తెలిపారు.

రాజమండ్రి నగరపాలక సంస్థపై బీజేపీ జెండా ఎగురవేస్తాం: ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్
AP BJP Chief PVN Madhav

రాజమండ్రి, నవంబర్13: రాజమండ్రి నగరపాలక సంస్థపై బీజేపీ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. స్థానిక అభ్యర్థికే మేయర్ టికెట్ కేటాయిస్తామని తెలిపారు. కార్యకర్తల అభిప్రాయాల మేరకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పారు. శుక్రవారం రాజమండ్రిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి మంచి ఫలితాలు సాధించిందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లోనూ 100 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.


రానున్న గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని అన్నారు. పుష్కరాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెద్ద ఎత్తున నిధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తామని వెల్లడించారు. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న 31వ వార్షిక సీఐఐ సదస్సుకు మంచి ఆదరణ లభిస్తోందని చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పారిశ్రామిక అవకాశాలు పెరిగేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ విశ్వాసం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

గ్రామ పంచాయతీల్లో మొత్తం 2.61 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎస్ఈసీ

హైదరాబాద్‌కు బిల్ గేట్స్‌ను నేనే రప్పించా.. ఆనాడే ఐటీపై ఫోకస్ పెట్టా: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 13 , 2026 | 03:56 PM