గోదావరి పుష్కరాలపై డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సమీక్ష..
ABN , Publish Date - Apr 05 , 2026 | 09:40 PM
గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న వేళ తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పర్యటించారు. ఈ సందర్భంగా పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా: గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న వేళ తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పర్యటించారు. ఈ సందర్భంగా పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు. కోనసీమ జిల్లాలో పర్యటించిన డీజీపీ.. క్రైమ్, లా అండ్ ఆర్డర్ పరిశీలించేందుకు వచ్చినట్లు చెప్పారు. జిల్లా ఎస్పీ, ఐజీ, ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించినట్లు డీజీపీ వెల్లడించారు. ఇది కొత్త జిల్లా కాబట్టి సమస్యలు, మౌలిక సదుపాయాల గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. తీర ప్రాంతం ఎక్కువ కాబట్టి గస్తీ బోట్ల ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గస్తీ సమస్యలు, సిబ్బంది సమస్యలు ఉన్నాయని, రెండు మూడు నెలల్లో మార్పును చూస్తారంటూ చెప్పారు.
అనంతరం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పర్యటించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అలాగే పుష్కరాల సందర్భంగా నిర్మించిన పోలీస్ గెస్ట్ హౌస్ నూతన భవనం, నూతన డాగ్ కెన్నెల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ డీజీ(లా అండ్ ఆర్డర్) ఎన్.మధుసూదన్ రెడ్డి, ఏలూరు రేంజ్ ఐ.జి. జీవీజీ అశోక్ కుమార్, డీఐజీ ఫకీరప్ప, తూ.గో.జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
అనంతపురం జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే..
కడప జిల్లా వీరన్నగట్టుపల్లి వద్ద బస్సు ప్రమాదం.. 21 మంది సురక్షితం..