అనంతపురం జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే..
ABN , Publish Date - Apr 05 , 2026 | 03:56 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు(సోమవారం) అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. హంద్రీనీవా, సాగునీటి భద్రత వంటి పలు అంశాలపై కీలక సమీక్షలు, చర్చలు చేయనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ విడుదలైంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు(సోమవారం) అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. హంద్రీనీవా, సాగునీటి భద్రత వంటి పలు అంశాలపై కీలక సమీక్షలు, చర్చలు చేయనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ విడుదలైంది. సోమవారం ఉదయం 10:30కు అమరావతి నుంచి అనంతపురానికి సీఎం చంద్రబాబు బయలుదేరుతారు. మధ్యాహ్నం 12:10 గంటలకు వేములపాడు చేరుకుంటారు. సాయంత్రం 7:35 గంటలకు తిరిగి అమరావతికి బయలుదేరుతారు. ఈ పర్యటన సందర్భంగా రైతులు, సాగునీటి సంఘాలు, అధికారులు, టీడీపీ శ్రేణులతో సీఎం చంద్రబాబు సమావేశం అవుతారు.
మెుదటగా తాడిపత్రి నియోజకవర్గంలో సాగునీటి భద్రతపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. ఇందుకు యాడికిలో సాగునీటి సంఘాలు, రైతులు, అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం హంద్రీనీవా కాలువ నీటి ప్రయోజనాలపైనా రైతులతో చర్చిస్తారు ముఖ్యమంత్రి. కాలువ విస్తరణ, సాగు విస్తీర్ణంపైనా సమీక్షిస్తారు. నీటి నిర్వహణ, భూగర్భ జలాలపై రైతులు, అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. సాగునీటి సంఘాలకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అందించనున్నారు. అనంతరం యాడికి మార్కెట్ యార్డ్ వద్ద ప్రజావేదికలో సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు.
ఆ తర్వాత వేములపాడు సమీపంలోని పెండేకల్లు రిజర్వాయర్ పనులను పరిశీలిస్తారు చంద్రబాబు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్(PMDS), హాఫ్ మూన్ వ్యవసాయాన్నీ పరిశీలించనున్నారు. అనంతరం స్థానిక నేతలు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రానున్న కాలంలో పార్టీ కార్యక్రమాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. నియోజకవర్గానికి సంబంధించి పలు వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకోనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
మావిగన్‌పై అంత ప్రేముంటే.. సీఆర్డీఏను ఎందుకు రద్దు చేయాలనుకున్నారు జగన్: పట్టాభి ప్రశ్న
ఏపీ తీర ప్రాంతంలో చేపల అక్రమ వేట.. తమిళనాడు బోట్లపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం..