ఇంట్లో దోమలు ఎక్కువయ్యాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!
ABN , Publish Date - Apr 05 , 2026 | 03:41 PM
ఎండాకాలం మొదలైంది.. ఈగలు, దోమలు ఇంట్లోకి ప్రవేశించి చికాకు తెప్పిస్తుంటాయి. ఎప్పుడు మలేరియా వస్తుందో... డెంగ్యూ వస్తుందో అని భయం. ఇంట్లో దోమలను తరిమే చిట్కాల గురించి తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ఎండాకాలం మొదలైంది.. ఈగలు, దోమలు ఇంట్లోకి ప్రవేశించి చికాకు తెప్పిస్తుంటాయి. ఎప్పుడు మలేరియా వస్తుందో... డెంగ్యూ వస్తుందో అని భయం. అందుకే సాధ్యమైనంత వరకు సాయంత్రం వేళల్లో తలుపులు, కిటికీలు మూసి వేస్తుంటారు. సాధారణంగా దోమలను తరిమికొట్టడానికి రసాయనాలతో కూడిన మస్కిటో కాయిల్స్ లేదా లిక్విడ్స్ వాడుతుంటారు. వాటి వల్ల కొందరికి శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇంట్లోనే లభించే సహజ సిద్ధమైన వస్తువులతో దోమలకు ఎలా చెక్ పెట్టొచ్చో తెలుసుకుందాం.
1. లావెండర్ మొక్క: ఈ మొక్క దోమల నివారణకు బాగా సహాయపడతాయి. కేవలం దోమలను మాత్రమే కాకుండా ఇతర తెగుళ్లు, ఎలుకలు, ఈగలను దూరంగా ఉంచుతాయి. ఈ మొక్కలు చిన్నవిగా ఉండటం వల్ల ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉంటాయి.
2. వేప నూనె: వేప నూనెను కొబ్బరి నూనెతో కలిపి ఒంటికి రాసుకోవడం వల్ల లేదా దీపంలా వెలిగించడం వల్ల దోమలు దరిచేరవు
3. కర్పూరం: గదిలో కర్పూరాన్ని వెలిగించి, కిటికీలు, తలుపులు ఒక 15 నిమిషాల పాటు మూసివేస్తే దోమలు పారిపోతాయి.
4. వెల్లుల్లి: వెల్లుల్లి రెబ్బలను నీటిలో ఉడికించి, ఆ నీటిని స్ప్రే బాటిల్‌లో పోసి గది మూలల్లో చల్లితే దోమల ఉధృతి తగ్గుతుంది.
5. నిమ్మకాయ, లవంగాలు: సగం కోసిన నిమ్మకాయ ముక్కల మధ్య లవంగాలను పెట్టి దోమలు ఉన్న చోట ఉంచితే.. ఆ వాసనకు పావు గంటలో దోమలన్నీ బయటికి వెళ్లిపోతాయి.
6. తేనె: ఏదైనా పేపర్ ముక్కపై తేనె రాయండి. దోమలు ఉన్న చోటు ఉంచండి. తేనె తీపి దోమలను ఆకర్షిస్తాయి. పేపర్‌పై వాలిన దోమలు ఎగిరిపోలేని పరిస్థితి. దాంతో కొద్దిసేపటి తర్వాత చనిపోతాయి.
ఇంటి పరిసరాల పరిశుభ్రత:
దోమలు పెరగకుండా ఉండాలంటే వాటి నివాస స్థలాలను దెబ్బతీయాలి. కుండలు, పాత టైర్లు, కూలర్లు లేదా పూల కుండీలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమలు నిల్వ ఉన్న నీటిలోనే గుడ్లు పెడతాయి. కిటికీలకు, తలుపులకు సన్నని జాలీలను అమర్చు కోవడం వల్ల గాలి వస్తుంది కానీ దోమలు లోపలికి రావు.
దోమలను తరిమే మొక్కలు:
ఇంట్లో లేదా బాల్కనీలో కొన్ని ప్రత్యేకమైన మొక్కలను పెంచడం ద్వారా సహజంగానే దోమలను నిమంత్రించవచ్చు. లెమన్ గ్రాస్‌లో ఉండే సిట్రోనెల్లా అనే పదార్థం దోమలను సమర్థవంతంగా అడ్డుకుంటుంది. పుదీనా వాసన దోమలకు పడదు. ఇది ఇంటికి మంచి సువాసనను కూడా ఇస్తుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..
గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు
For More Health News