నార్త్ సబ్ డివిజన్ ఏఈ బాధ్యతల నుంచి సుబ్రహ్మణ్యాన్ని తప్పించిన టీటీడీ
ABN , Publish Date - Jul 21 , 2026 | 08:52 PM
తిరుమల నార్త్ సబ్ డివిజన్ ఇన్‌ఛార్జి ఏఈ బాధ్యతల నుంచి పీఎంవీ సుబ్రహ్మణ్యాన్ని టీటీడీ ఇంజనీరింగ్ విభాగం తప్పించింది. ఆయనను గతంలో ఉన్న స్థానానికి పరిమితం చేసింది.
అమరావతి, జులై 21: తిరుమల నార్త్ సబ్ డివిజన్ ఇన్‌ఛార్జి ఏఈ బాధ్యతల నుంచి పీఎంవీ సుబ్రహ్మణ్యాన్ని టీటీడీ ఇంజనీరింగ్ విభాగం తప్పించింది. ఆయనను గతంలో ఉన్న స్థానానికి పరిమితం చేసింది. సుబ్రహ్మణ్యం స్థానంలో వేణుగోపాల్‌ను నియమించింది. ఈ మేరకు మంగళవారం టీటీడీ ఇంజనీరింగ్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల పీఎంవీ సుబ్రహ్మణ్యాన్ని తిరుమల నార్త్ సబ్ డివిజన్ ఇన్‌ఛార్జి ఏఈగా బాధ్యతలు అప్పగించింది. ఆయన నియామకంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయాయి.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేశారు. ఆ సమయంలో సుబ్రహ్మణ్యం స్వీట్లు పంచి పెట్టి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వ్యక్తికి కీలకమైన ఏఈ బాధ్యతలు అప్పగించడంపై స్థానికంగా తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో గతంలో సుబ్రహ్మణ్యానికి ఇచ్చిన పోస్టింగ్ ఉత్తర్వులను టీటీడీ ఇంజనీరింగ్ విభాగం రద్దు చేసింది. ఆ బాధ్యతల నుంచి ఆయనను తప్పిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
షూటింగ్‌లో గాయపడిన బాలకృష్ణకు సీఎం చంద్రబాబు పరామర్శ
Read Latest AP News And Telugu News