Share News

తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న త్రిష..

ABN , Publish Date - May 04 , 2026 | 11:41 AM

తిరుమలలో కొలువుదీరిన కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ నటి త్రిష దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున స్వామి వారిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న త్రిష..

తిరుమల, మే 04: తిరుమలలో కొలువుదీరిన కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ నటి త్రిష దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున స్వామి వారిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆ తర్వాత అధికారులు ఆమెకు స్వామి వారి ప్రసాదం అందించారు. దర్శనం అనంతరం ఆలయం బయట త్రిష నడుస్తుంటే.. మేడమ్, ఈ రోజు ఫలితం మన వైపే ఉందంటూ ఒక అభిమాని వ్యాఖ్యలు చేశాడు. దీంతో త్రిష నవ్వుతూ వెళ్లిపోయింది.


ఆదివారం కారులో త్రిష తిరుపతికి వెళ్తూ వీడియో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 4వ తేదీ త్రిష పుట్టిన రోజు. అందుకే తిరుమలలో స్వామి వారిని ఆమె దర్శించుకున్నారని ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరో వైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. ఈ ఓట్ల లెక్కింపులో ప్రముఖ హీరో, దళపతి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ముందంజలో ఉంది. అధికార డీఎంకే మూడో స్థానంలో ఉండగా.. ఏఐడీఎంకే రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు పార్టీలను వెనక్కి నెట్టి టీవీకే పార్టీ అగ్రస్థానంలో దూసుకెళ్తోంది.


తన పుట్టిన రోజునే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడం.. అందులో టీవీకే పార్టీ విజయం వైపు దూసుకు పోవడం యాదృచ్ఛికమే అయినా.. తిరుపతిలో మాత్రం త్రిష అందరి దృష్టిని ఆకర్షించింది. గత కొన్ని నెలలుగా త్రిష పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కోలీవుడ్ హీరో విజయ్, త్రిష ప్రేమలో ఉన్నారనే ప్రచారం చాలా కాలంగా నడుస్తోంది. ఈ ప్రచారంపై వీరిద్దరు ఇప్పటి వరకు స్పందించ లేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు జన్మదిన శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

బెంగాల్‌లో ఇక్కడ గెలిచిన పార్టీదే ‘అధికారం’

For More AP News And Telugu News

Updated Date - May 04 , 2026 | 11:48 AM