Share News

తిరుపతిలో డ్రోన్ ఆపరేషన్.. పేకాటరాయుళ్ల అరెస్ట్

ABN , Publish Date - Aug 28 , 2026 | 03:50 PM

తిరుపతి జిల్లాలోని పుత్తూరు అర్బన్ పోలీసులు నిర్వహించిన డ్రోన్ ఆపరేషన్‌లో జూదం ఆడుతున్న పలువురు పట్టుబడ్డారు. కేబీఆర్‌ పురం-సెలంకొండ ప్రాంతంలో జూద స్థావరంపై పోలీసులు దాడి చేశారు.

తిరుపతిలో డ్రోన్ ఆపరేషన్.. పేకాటరాయుళ్ల అరెస్ట్
Tirupati news

తిరుపతి, ఆగస్టు 28: పుత్తూరు అర్బన్ పోలీసులు నిర్వహించిన డ్రోన్ ఆపరేషన్‌లో జూదం ఆడుతున్న పలువురు పట్టుబడ్డారు. కేబీఆర్‌ పురం-సెలంకొండ ప్రాంతంలో జూద స్థావరంపై పోలీసులు దాడి చేశారు. రవి మామిడి తోటలో జూదం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందండంతో డ్రోన్‌ కెమెరా సహాయంతో జూద స్థావరాన్ని గుర్తించారు. వెంటనే ఎస్‌డీపీవో ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేకంగా దాడి చేశారు. ఈ క్రమంలో జూదం ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రూ.1,02,570 నగదు, రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు మొబైల్‌ ఫోన్లను కూడా స్వాధీనం చేశారు.


అరెస్ట్‌ అయిన వారు బెనర్జీ, దేవేంద్రన్‌, పి.కె. మురళి, సి. సునీల్‌ గవాస్కర్‌‌గా గుర్తించారు. అయితే పోలీసులను గమనించిన పలువురు అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో పరారీలో ఉన్న మహేష్‌, పొన్నుస్వామి, సంజయ్‌, సైమన్‌, సుధాకర్‌, మోహన్‌రాజ్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జూదం, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి..

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబు బాధ్యతల స్వీకరణ

2047 నాటికి 50 శాతం పచ్చదనమే లక్ష్యం: నాగబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 28 , 2026 | 03:50 PM