Share News

2047 నాటికి 50 శాతం పచ్చదనమే లక్ష్యం: నాగబాబు

ABN , Publish Date - Aug 28 , 2026 | 03:23 PM

2047 నాటికి 50 శాతం పచ్చదనమే లక్ష్యమని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగబాబు అన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలనూ భాగస్వాములను చేస్తామని చెప్పారు.

2047 నాటికి 50 శాతం పచ్చదనమే లక్ష్యం: నాగబాబు
Nagababu

అమరావతి, ఆగస్టు 28: 2047 నాటికి 50 శాతం పచ్చదనమే లక్ష్యమని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగబాబు అన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలనూ భాగస్వాములను చేస్తామని చెప్పారు. ఈరోజు(శుక్రవారం) మంగళగిరి అరణ్యభవన్‌లో ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నాగబాబు మీడియాతో మాట్లాడుతూ.. మొక్కలు నాటడమే కాదు.. వాటి మనుగడకూ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకొని లక్ష్యాలను సాధిస్తామని వెల్లడించారు.


‘ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం ఎంతో గౌరవంగా, బాధ్యతగా భావిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు. ఏపీ గ్రీన్ సొసైటీ నిర్దేశించుకున్న లక్ష్యాలను సమర్థవంతంగా సాధించేందుకు పూర్తి చిత్తశుద్ధితో కృషి చేస్తాను. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, అటవీ విస్తీర్ణం అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాల సాధనకు ఏపీ గ్రీన్ ద్వారా కృషి చేస్తాను’ అని నాగబాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఏపీకి భారీ ప్రాజెక్ట్.. మూడో అతిపెద్ద డిజిటల్ ల్యాండింగ్ హబ్‌గా అవతరణ

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబు బాధ్యతల స్వీకరణ

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 28 , 2026 | 03:26 PM