టీడీపీ కార్యాలయం మాకు దేవాలయంతో సమానం: పనబాక లక్ష్మి
ABN , Publish Date - Feb 22 , 2026 | 04:46 PM
తిరుపతి జిల్లా అవిలాలలో టీడీపీ కార్యాలయానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.
తిరుపతి, ఫిబ్రవరి 22: అవిలాలలో టీడీపీ(TDP) తిరుపతి పార్లమెంట్ కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి, జిల్లా టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జి పనబాక లక్ష్మి, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు సహా పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఎన్నో ఏళ్ల కోరికను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లు నెరవేర్చారని ఈ సందర్భంగా పనబాక లక్ష్మి అన్నారు.
'తిరుపతిలో టీడీపీ ప్రాంతీయ కార్యాలయానికి భూమిపూజ చేసుకున్నాం. రాష్ట్రంలో 6 టీడీపీ కార్యాలయాలకు ఒకేరోజు శంకుస్థాపన చేసుకుంటున్నాం. టీడీపీ ఆఫీస్ అంటే మాకు దేవాలయంతో సమానం' అని పనబాక లక్ష్మి అన్నారు.
ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. 'పండుగ వాతావరణాన్ని తలపించేలా కార్యాలయ భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ప్రతి కార్యకర్త సంతోషంగా ఉన్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది' అని అన్నారు.
'శ్రీవారి పాదాల చెంత టీడీపీ పార్లమెంట్ కార్యాలయానికి భూమిపూజ చేసుకోవడం ఆనందంగా ఉంది. ప్రజలకు మరింత సేవ చేయడానికి పార్టీ కార్యాలయం అందుబాటులో ఉంటుంది. 6 నుంచి 8 నెలల్లో ఈ కార్యాలయ నిర్మాణం పూర్తిచేస్తాం' అని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వెల్లడించారు.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. 'కార్యకర్తలకు పెద్దపీట వేసే ఒకే ఒక్క పార్టీ టీడీపీ. నూతన పార్టీ కార్యాలయాన్ని అనుకున్న సమయం కన్నా ముందుగానే పూర్తి చేస్తాం' అని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నాగర్‌కర్నూల్ జిల్లా మల్లన్న జాతరలో తీవ్ర విషాదం..
ఇది ట్రైలర్ మాత్రమే.. షబ్బీర్ అలీకి వెంకటరమణా రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్