Share News

శాంతిపురం కేసు కొట్టివేత.. 29 మంది టీడీపీ నేతలకు ఊరట

ABN , Publish Date - Nov 06 , 2026 | 03:13 PM

శాంతిపురం కేసులో టీడీపీ నేతలకు భారీ ఊరట లభించింది. శాంతిపురం కేసును కొట్టివేస్తూ కుప్పం అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డితో పాటు 28 మంది టీడీపీ నాయకులకు ఊరట లభించినట్లైంది.

శాంతిపురం కేసు కొట్టివేత.. 29 మంది టీడీపీ నేతలకు ఊరట
Shanthipuram Case

చిత్తూరు, నవంబర్ 6: శాంతిపురం కేసులో టీడీపీ నేతలకు భారీ ఊరట లభించింది. శాంతిపురం కేసును కొట్టివేస్తూ కుప్పం అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డితో పాటు 28 మంది టీడీపీ నాయకులకు ఊరట లభించినట్లైంది. 2021లో రైతుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ధర్నాకు సంబంధించి కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. రాళ్లబుదుగూరు పోలీస్ స్టేషన్‌లో సీసీ నంబర్ 220/2022 కింద కేసు నమోదు అవగా.. ఈ కేసులో ఎమ్మెల్యే అమరనాథ్‌ రెడ్డి ఏ-1 నిందితుడిగా ఉన్నారు. నిందితుల్లో పి.మనోహర్, పి.ఎస్. మునిరత్నం, గౌనివారి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.


ఈ కేసుకు సంబంధించి ఈరోజు (శుక్రవారం) కుప్పం కోర్టుకు ఎమ్మెల్యే సహా టీడీపీ నాయకులు హాజరయ్యారు. సుదీర్ఘ విచారణ అనంతరం కేసును కొట్టివేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. కోర్టు ప్రాంగణం వద్ద స్వీట్లు పిణీ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ కక్షతో తప్పుడు కేసులు పెట్టారని, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి...

తమిళనాడు బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం

రూ.3,000 కోట్ల ఉపాధి హామీ నిధులను నొక్కేశారు.. వైసీపీపై అశోక్‌బాబు ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 03:22 PM