Share News

శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం.. నవ దంపతులకు గాయాలు

ABN , Publish Date - Nov 24 , 2026 | 08:53 PM

శ్రీవారి దర్శనానికి వెళ్తున్న కొత్తగా పెళ్లైన వధూవరుల కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది.

శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం.. నవ దంపతులకు గాయాలు

తిరుపతి జిల్లా, నవంబర్ 24: శ్రీవారి దర్శనానికి వెళ్తున్న కొత్తగా పెళ్లైన వధూవరుల కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవ దంపతులతో పాటు వాహనంలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణ శివారు బసవయ్యపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..


పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన గోపి, వసంతలకు నిన్న (సోమవారం) వివాహం జరిగింది. వివాహం అనంతరం పసుపు వస్త్రాలతో ఈ జంట శ్రీవారి దర్శనానికి బయలుదేరింది. వీరితో పాటు ముగ్గురు బంధువులూ ఉన్నారు. బసవయ్యపాలెం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పింది. ఆపై డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కొత్త జీవితాన్ని ప్రారంభించిన వధూవరులు శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరగడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు.


ఈ వార్తలూ చదవండి

అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి

ఏపీ పంచాయతీ ఎన్నికలకు పోలీసులతో భారీ భద్రత.. విజయోత్సవ ర్యాలీలపై నిషేధం: డీజీపీ

Updated Date - Nov 24 , 2026 | 08:53 PM