చిత్తూరు జిల్లా తుమ్మిందపాలెంలో దారుణం..
ABN , Publish Date - Mar 04 , 2026 | 05:47 PM
చిత్తూరు గ్రామీణ మండలం తుమ్మిందపాలెంలో దారుణం జరిగింది. ఇద్దరి వ్యక్తులు మధ్య నగదు విషయంలో వివాదం తలెత్తింది.
చిత్తూరు, మార్చి 04: చిత్తూరు గ్రామీణ మండలం తుమ్మిందపాలెంలో దారుణం జరిగింది. ఇద్దరి వ్యక్తులు మధ్య నగదు విషయంలో వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో సాయికుమార్ అనే వ్యక్తిని ఢిల్లీ బాబు నాటు తుపాకీతో కాల్చి హత్య చేశాడు. అనంతరం అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి.. తాలుకా పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు తుమ్మిందపాలెం గ్రామానికి చేరుకుని.. సాయికుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చిత్తూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఢిల్లీ బాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుడు సాయికుమార్ కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇవ్వడంతో.. ప్రభుత్వాసుపత్రి వద్దకు వారు చేరుకున్నారు.
పోలీసులు వారిని విచారిస్తున్నారు. సాయికుమార్, ఢిల్లీ బాబులకు గతంలో స్నేహం ఉందా? ఎప్పుటి నుంచి ఉంది. వీరి మధ్య నగదు వివాదం ఎందుకు వచ్చిందనే కోణంలో సాయికుమార్ కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో టీనేజ్ ప్రెగ్నెన్సీలు పెరుగుతున్నాయి: మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ
వేట్లపాలెంలో పేలుడు ఘటనలో 25కి చేరిన మృతులు
Read Latest AP News And Telugu News