CM Chandrababu: ప్రజలకు సీఎం చంద్రబాబు భోగి శుభాకాంక్షలు
ABN , Publish Date - Jan 13 , 2026 | 09:53 PM
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు భోగి శుభాకాంక్షలు తెలిపారు. నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు.
చిత్తూరు, జనవరి 13: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు భోగి పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన స్వగ్రామం నారావారిపల్లిలో కుటుంబసభ్యులతో కలిసి ఆయన సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన ఎక్స్ ఖాతా వేదికగా ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘సంక్రాంతి ముగ్గులతో అలరారుతున్న తెలుగు లోగిళ్లలో భోగి పండుగ జరుపుకుంటున్న తెలుగు ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దేదీప్యమానంగా వెలిగే భోగి మంటలు మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
ఆశావహ దృక్పథంతో సాగే మీ ఆలోచనలు సాకారం కావాలని... అందుకు మీకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. మీ జీవితం భోగభాగ్యాలతో తులతూగాలని కోరుకుంటూ, మరొక్కమారు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా' అని పేర్కొన్నారు.
అలాగే మరో ట్విట్ చేశారు సీఎం చంద్రబాబు..
'సంక్రాంతి అంటే.. ప్రతి ఒక్కరూ సొంతూళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులతో జరుపుకునే అతిపెద్ద పండుగ. మేం కూడా కుటుంబసభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకోడానికి నారావారిపల్లికు వెళ్లాము. గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నాను.
సంప్రదాయ కార్యక్రమాలు, రంగ వల్లులు, పిల్లల ఆటపాటలతో మా పల్లెలో పండుగ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆటల్లో గెలిచిన చిన్నారులకు బహుమతులు ఇచ్చి వారితో సరదాగా గడిపాము. అనంతరం నారావారిపల్లితోపాటు తిరుపతిలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశా' అంటూ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైలు పట్టాలపైనే మహిళ ప్రసవం.. ఏమైందంటే?
బెట్టింగ్ యాప్ బారిన పడి యువకుడి బలి
Read Latest AP News And Telugu News