ఐటీ హబ్‌గా ఏపీని మార్చిన విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు: హోంమంత్రి అనిత
ABN , Publish Date - May 28 , 2026 | 06:46 PM
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వార్షిక పండగ ‘మహానాడు’ మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి అనిత.. సీఎం చంద్రబాబు విజనరీ గురించి గొప్పగా కొనియాడారు.
అమరావతి, మే 28: నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో, ఐటీ రంగాభివృద్ధిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాత్ర ఎంతో గొప్పదని, ఆయన విజనరీ లీడర్ అని రాష్ట్ర హోంమంత్రి అనిత కొనియాడారు. చంద్రబాబు నాయుడుకు ఉన్న దార్శనికత వల్లే నాడు ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా.. విభజన తర్వాత కూడా ఏపీ ఐటీ హబ్‌గా ఎదగడానికి బలమైన పునాదులు పడ్డాయని ఆమె స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. ‘రాష్ట్ర విభజన జరిగిన సమయంలో దాదాపు రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో నవ్యాంధ్ర ప్రస్థానం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రారంభమైంది. చంద్రబాబు తన సుదీర్ఘ అనుభవంతో, అపారమైన దార్శనికతతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఎన్నో విప్లవాత్మక పరిపాలనా సంస్కరణలు తీసుకువచ్చారు. 2019-24 ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా విధ్వంస పాలన కొనసాగింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్మించిన ‘ప్రజావేదిక’ భవనాన్ని కూల్చివేశారు. నాటి ప్రభుత్వ అరాచకాలను ఎండగడుతూ రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న తీవ్ర నిరుద్యోగ సమస్యపై పోరాడేందుకు నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. తాము చేతుల్లో గొడ్డళ్లు, కత్తులు పట్టుకుని ఫ్యాక్షనిజం తరహా పాలన సాగించలేదని, తామెప్పుడూ ప్రజాస్వామ్య బద్ధంగా, అభివృద్ధి ధ్యేయంగానే ముందుకెళ్తున్నాం’ అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కూలగొట్టడం, విధ్వంసం చేయడమే గొడ్డలి పార్టీ నైజం: మంత్రి నిమ్మల
ఆ విషయాన్ని నమ్మిన నాయకుడు సీఎం చంద్రబాబు: కేంద్ర మంత్రి పెమ్మసాని
For More AP News And Telugu News