Share News

ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో రోబోటిక్ సర్జరీలు.. ప్రణాళికలు రూపొందిస్తున్న ఏపీ ప్రభుత్వం

ABN , Publish Date - Nov 19 , 2026 | 08:43 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బోధనాసుపత్రులలో రోబోటిక్ శస్త్రచికిత్సలను ప్రవేశపెట్టాలన్న దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది. ఇందుకోసం వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు.

ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో రోబోటిక్ సర్జరీలు.. ప్రణాళికలు రూపొందిస్తున్న ఏపీ ప్రభుత్వం
ap robotic surgeries in ap govt hospitals

అమరావతి, నవంబర్ 19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బోధనాసుపత్రులలో రోబోటిక్ శస్త్రచికిత్సలను ప్రవేశపెట్టాలన్న దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది. ఇందుకోసం వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు.


ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో రోబోటిక్ శస్త్రచికిత్సను ప్రవేశపెట్టే దిశగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ముందుగా విజయవాడలోని ప్రభుత్వ బోధనాసుపత్రిలో రూ. 45 కోట్లతో రోబోటిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఐవీఎఫ్, బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్ కేంద్రాలు, ఇతర సౌకర్యాల కల్పనకు రూ. 1,011 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలకు రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించంది. రోగుల అవసరాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో వెంటిలేటర్ల సదుపాయాన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కల్పించాలనుకున్నట్లు తెలిపింది.


ఇవి కూడా చదవండి...

జగన్ అక్రమాస్తుల కేసు.. స్టేటస్ రిపోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశం

‘క్రమశిక్షణ ముందు అందరూ సమానమే’.. రాజ్‌గోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ రియాక్షన్

Read latest Telangana News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 08:43 PM