Share News

రేపే ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్.. మూడు దశల్లో పోలింగ్‌కు ప్లాన్!

ABN , Publish Date - Nov 11 , 2026 | 08:10 PM

ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ రేపే విడుదల కానుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం రేపు(గురువారం) మధ్యాహ్నం 12:30 గంటలకు నిర్వహించే ప్రెస్‌మీట్‌లో పూర్తి వివరాలను తెలియజేయనుంది.

రేపే ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్.. మూడు దశల్లో పోలింగ్‌కు ప్లాన్!
ap panchayat elections schedule

అమరావతి, నవంబర్ 11: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రేపు విడుదల కానుంది. కాగా.. పంచాయతీ ఎన్నికలతో పాటు 23 పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఏపీ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను రేపు ప్రెస్‌మీట్‌లో తెలియజేయనుంది. కాగా.. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ నెల 13, 16, 19వ తేదీల్లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేసి.. ఈ నెల 26, 29, డిసెంబర్ 2 వ తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా.. పోలింగ్ తేదీనే ఎన్నికల ఫలితాలను కూడా వెల్లడిస్తుంది. ఈ మేరకు పంచాయతీ ఎన్నికలతో పాటు 23 పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

యుద్ధానికి ముగింపు పలకాలంటే.. అమెరికాకు ఇరాన్ ఏం చెప్పిందంటే..


స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే...

Updated Date - Nov 11 , 2026 | 08:10 PM