పోలింగ్‌లో ఓటర్ల చిటికెన వేలుపై సిరా గుర్తు.. ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ABN , Publish Date - Nov 14 , 2026 | 02:56 PM
ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ సమయంలో.. ఓటరు చిటికెన వేలుపై సిరా గుర్తును వేయనున్నట్లు వెల్లడించింది.
విజయవాడ, నవంబర్ 14: ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్ సమయంలో సిరా గుర్తు వినియోగంపై కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తొలి విడత పోలింగ్‌ను నవంబర్ 26న, రెండో విడత పోలింగ్‌ను 29న, మూడో విడత పోలింగ్‌ను డిసెంబర్ 2 తేదీల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ సమయంలో.. ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలుపై సిరా గుర్తును వేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.
కాగా.. రాష్ట్రంలో ఇటీవల ఎమ్‌పీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికలు పూర్తి అయిన నేపథ్యంలో.. పోలింగ్ సమయంలో ఓటర్ల చూపుడు వేలిపై వేసిన సిరా గుర్తులు ఇంకా తొలగిపోకపోవచ్చని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికల సమయంలో ఓటర్లు, ఎన్నికల సిబ్బంది.. ఎలాంటి గందరగోళానికి గురవకుండా ఉండేందుకు.. ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలుపై సిరా వేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్