ఏపీలో ప్రశాంతంగా కొనసాగుతున్న 23 పట్టణ స్థానిక సంస్థల నోటిఫికేషన్ల ప్రక్రియ
ABN , Publish Date - Nov 15 , 2026 | 09:32 PM
ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ రోజు (ఆదివారం) ఒక్కరోజే మొత్తం 1,502 నామినేషన్లు దాఖలు కాగా.. ఇందులో మేయర్ పదవులకు 69, వార్డు సభ్యుల పదవులకు 1,433 నామినేషన్లు వచ్చాయి.
అమరావతి, నవంబర్ 15: ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ రోజు (ఆదివారం) ఒక్కరోజే మొత్తం 1,502 నామినేషన్లు దాఖలు కాగా.. ఇందులో మేయర్ పదవులకు 69, వార్డు సభ్యుల పదవులకు 1,433 నామినేషన్లు వచ్చాయి. కాగా ఇప్పటి వరకు మేయర్ పదవులకు మొత్తంగా 85, వార్డు సభ్యుల పదవులకు 1,689 నామినేషన్లు దాఖలు అయినట్లు తెలుస్తోంది.
ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు మేయర్ పదవులకు 85 దరఖాస్తులు రాగా.. వార్డు సభ్యుల పదవులకు 1,689 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం కలిపి 1,774 నామినేషన్లు దాఖలు అయినట్లు తెలుస్తోంది.
4 మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ రోజున మొత్తం 428 నామినేషన్లు దాఖలు కాగా.. మేయర్ పదవులకు 16, వార్డు సభ్యుల పదవులకు 412 నామినేషన్లు వచ్చాయి. నిన్న దరఖాస్తు చేసుకున్న వాటితో కలిపి మొత్తంగా.. 4 కార్పొరేషన్లకు 532 నామినేషన్లు దాఖలయ్యాయి.
19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఈ రోజున మొత్తం 1,072 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో చైర్ పర్సన్ పదవులకు 53, వార్డు సభ్యుల పదవులకు 1,019 నామినేషన్లు వచ్చాయి. నిన్నటి వాటితో కలిపి మొత్తంగా 1,240 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో.. చైర్ పర్సన్ పదవులకు మొత్తంగా 63, వార్డు సభ్యుల పదవులకు 1,177 నామినేషన్లు నమోదయ్యాయి. కాగా.. నంద్యాలలోని ఆత్మకూరు మున్సిపాలిటీలోని 20వ వార్డు సభ్యుడి పదవికి నిన్నటి నుంచి మొత్తంగా 2 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. పుణే విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం
For More AP News And Telugu News