ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. 2027 నుంచి అమల్లోకి
ABN , Publish Date - Oct 15 , 2026 | 09:47 PM
ఇంటర్ పరీక్షా విధానంలో ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్టు కీలక మార్పులు తీసుకొచ్చింది. ప్రశ్నపత్రాలు, ఓఎమ్ఆర్ షీట్లు, ఆన్సర్ బుక్లెట్లలో పేజీల సంఖ్యను మార్చనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, అక్టోబర్, 15: ఇంటర్ పరీక్షా విధానంలో మార్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు కీలకనిర్ణయం తీసుకుంది. నూతన విధానాలు 2027 మార్చిలో జరగబోయే ఇంటర్ పరీక్షల నుంచి అమల్లోకి రానున్నట్లు బోర్డు వెల్లడించింది. ఈ మేరకు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఈ మార్పులపై అవగాహన కల్పించాలని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్కు ఏపీ ఇంటర్ బోర్డు సెక్రటరీ పి. రంజిత్ బాషా ఆదేశాలు జారీ చేశారు.
ఒకేషనల్ కోర్సులకు యథాతథంగా పాత పద్ధతిలోనే 24 పేజీల ఆన్సర్ బుక్లెట్ను ఉంచగా.. జనరల్ థియరీ సబ్జెక్టులన్నింటికీ ఆన్సర్ బుక్లెట్లో పేజీల సంఖ్యను 32కు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఫస్ట్, సెకండియర్ బయాలజీ పరీక్షకు ఒకే ఓఎమ్ఆర్ షీట్, 40 పేజీల ఆన్సర్ బుక్లెట్ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించింది. బొటనీ, జువాలజీలకు ఇకపై వేర్వేరు ఓఎమ్ఆర్ షీట్లు ఉండవని స్పష్టం చేసింది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ లాంటి ఎలక్టివ్ సబ్జెక్టులకు మాత్రమే వేర్వేరు ప్రశ్నపత్రాలు ఉంటాయని బోర్డు వెల్లడించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్లు.. జాబితా విడుదల చేసిన ప్రభుత్వం
ఎల్నినో కోవిడ్ లాంటి సంక్షోభం.. రైతులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి
Read Latest AP News And Telugu News