రూ.5 వేల కోట్ల ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు ఆమోదం
ABN , Publish Date - Sep 15 , 2026 | 09:19 PM
రాష్ట్రంలో 14 పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం రూ.5,912 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులకు అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద ఫేజ్-3 ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
అమరావతి, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో పట్టణ మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.5,912 కోట్ల అంచనా వ్యయంతో 14 పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద ఫేజ్-3 ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల కింద అమరావతి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడతో పాటు రాష్ట్రంలోని ఇతర ముఖ్య పట్టణ కేంద్రాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
మొత్తం నిధుల్లో అమరావతి ఎకనామిక్ రీజియన్‌లోని 25 పట్టణాల్లో వరద నియంత్రణ, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధికి రూ.1,801 కోట్లు కేటాయించారు. తిరుపతి రీజియన్‌లో 23 పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు రూ.1,231.65 కోట్లను ఖర్చు చేయనున్నారు. విశాఖ రీజియన్‌లోని 11 పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు రూ.867 కోట్ల నిధులు కేటాయించారు. విజయవాడ నగరంలో వరద నియంత్రణ చర్యలకు రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. వీటితో పాటు రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు నగరాల్లోనూ పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
బొమ్మదేవర ధీరజ్.. భారత క్రీడా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారు: పవన్ కల్యాణ్
కాణిపాకం నుంచే ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఊపిరి: మంత్రి ఆనం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News