Share News

నేడు ఏపీ కేబినెట్ భేటీ.. రూ.88 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం!

ABN , Publish Date - Nov 27 , 2026 | 08:44 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు (శుక్రవారం) రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో భారీ పెట్టుబడులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

నేడు ఏపీ కేబినెట్ భేటీ.. రూ.88 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం!
ap cabinet meeting

అమరావతి, నవంబరు 27: ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు వర్చువల్ పద్దతిలో జరగనున్న ఈ భేటీలో భారీ పెట్టుబడులు, అమరావతి సంగమ ప్రాజెక్ట్ వంటి పలు ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. దాదాపు 30 ప్రతిపాదిత అజెండాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.


ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఏపీ క్యాబినెట్ భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 50వేల పైచిలుకు ఉద్యోగాలు కల్పించే దాదాపు రూ.88 వేల కోట్లకు పైగా పెట్టుబడులకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 10కి పైగా సంస్థల ఏర్పాటుకు సంబంధించిన భారీ పెట్టుబడి ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. డేటా సెంటర్లు, ఆటోమొబైల్, గ్రీన్ ఎనర్జీ, రక్షణ, ఐటీ రంగాల్లో పెట్టుబడులపై చర్చించనున్నారు. వివిధ సంస్థలకు భూమిని కేటాయించేందుకు నిర్ణయం తీసుకోనుంది. సీఆర్డీఏ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.

దానితో పాటు.. అమరావతిలోని 26 గ్రామాల్లో రహదారులు, డ్రెయిన్లు, పచ్చదనం అభివృద్ధి కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనుంది. అమరావతి సంగమం ప్రాజెక్టుపైనా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాగా.. అజెండా అంశాలపై చర్చించిన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.


ఈ వార్తలనూ చదవండి:

2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు

బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా

Updated Date - Nov 27 , 2026 | 08:44 AM